Site icon NTV Telugu

Mumbai: బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. 3 బస్సులు దగ్ధం

Mumbaifire

Mumbaifire

నవీ ముంబైలోని ఘన్సోలి డిపోలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున నిలిచి ఉన్న బస్సుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టంగా పొగలు అలుముకున్నాయి. అప్రమత్తం అయిన డిపో సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి ఫిర్యాదు చేశారు. హుటాహుటినా సంఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.

ఇది కూడా చదవండి: Jack : జాక్ దెబ్బ.. 4 కోట్లు వెనక్కిచ్చేసిన సిద్దు

అగ్నిప్రమాదంలో మూడు బస్సులు దగ్ధమైనట్లుగా తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సులో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లుగా అధికారులు భావిస్తున్నారు. మూడు బస్సులు పూర్తిగా దగ్ధం కాగా.. పలు బస్సులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. మరమ్మతుల కోసం డిపోలో నిలిచి ఉన్న ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగినట్లు తెలిపారు. వెంటనే పక్కనే ఉన్న డీజిల్ బస్సుకు అంటుకున్నాయని చెప్పారు. ఇలా మూడు బస్సులు దగ్ధమైపోయాయి. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని.. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటున్నట్లు చెప్పారు.

ఇది కూడా చదవండి: Meghalaya: టూరిస్ట్‌ రాజాది హత్యగా తేల్చిన పోలీసులు.. భార్య సోనమ్ ఆచూకీ కోసం గాలింపు

 

Exit mobile version