Ashish Vidyarthi: 60 ఏళ్ల వయస్సులో ‘పోకిరి’ విలన్ రెండో పెళ్లి.. పద్మావతి హ్యాపీయేనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashish Vidyarthi: పోకిరి సినిమాలో ఇలియానాను ఏడిపించే పోలీస్ ఆఫీసర్ గుర్తున్నాడా..? అదేనండీ .. పండుగాడు.. టైల్స్ ఏస్తన్నారంటగా.. పద్మావతి హ్యాపీయేనా అంటూ వార్నింగ్ ఇచ్చే సీన్ ఇప్పటికీ సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటుంది. ఆ అందులో నటించిన నటుడే ఆశిష్ విద్యార్థి. విలన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చే పాత్రలు చేసిన ఆశిష్ విద్యార్థి.. ఈ మధ్యనే వచ్చిన రైటర్ పద్మభూషణ్ సినిమాలో హీరో సుహాస్ కు తండ్రిగా నటించి మెప్పించాడు. ఇక తాజాగా ఈ విలన్ 60 ఏళ్ల వయస్సులో రెండో పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చాడు. అస్సాంకు చెందిన రూపాలి బారువాను అత్యంత సన్నహితుల మధ్య రెండో వివాహం చేసుకున్నాడు. రూపాలి.. కలకత్తాలో బిజినెస్ ఎంట్రఫ్యూనర్ గా ఉంది. గత కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందని వార్తలు వచ్చాయి. అయితే వాటికి చెక్ పెడుతూ వీరు పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చారు.
Devara: అర్ధరాత్రి నడిరోడ్డుపై మీ ముచ్చట్లు సరే .. ‘దేవర’ ఎక్కడ..?
Also Read
- Hatha Teaser: కిరణ్ అబ్బవరం బ్యానర్లో కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్గా ‘హతః’ టీజర్! చూశారా
- “ఎంత మాయగాడివయ్యా!” డైరెక్టర్ వశిష్ట పోస్ట్.. ‘Vishwambhara’ గురించేనా?
- Nani: నా సినిమాలకు ఆ ట్యాగ్ వద్దు.. కుండబద్దలు కొట్టిన న్యాచురల్ స్టార్!
- Mirzapur The Movie: 14వ రోజూ దుమ్మురేపిన 'మీర్జాపూర్: ది మూవీ'.. రూ.300 కోట్ల క్లబ్‌కు అడుగు దూరంలో!
ఇక ఆశిష్.. మొదటి భార్య రాజోషి. ఆమె నటిగా చాలామందికి తెలుసు. ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక అబ్బాయి. అయితే గత కొన్నేళ్లుగా భార్యాభర్తల మధ్య విబేధాలు జరుగుతున్నాయని, ఇద్దరు విడివిడిగా ఉంటున్నారని తెలుస్తుంది. కానీ, ఈ జంట విడాకులు తీసుకున్నట్లు ఒక్క వార్త కూడా రాకపోవడం గమనార్హం. అసలు విడాకులు తీసుకున్నారా..? లేదా..? అనేది ఎవరికి తెలియని మిస్టరీ. మరి మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా రూపాలిని ఎలా వివాహం చేసుకొని ఉంటాడని నెటిజన్లు ఆరాలు తీస్తున్నారు. ఇకపోతే ఈ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫోటోలపై అభిమానులు తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. పద్మావతి ఇప్పటికైనా హ్యాపీయేనా.. జాగ్రతగా చూసుకో అంటూ ఫన్నీగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
తాజావార్తలు
-
Smart Phone: 6000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్, 90Hz డిస్‌ప్లే , 12GB ర్యామ్.. మార్కెట్లోకి కొత్త ఫోన్..
-
Hatha Teaser: కిరణ్ అబ్బవరం బ్యానర్లో కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్గా ‘హతః’ టీజర్! చూశారా
-
BCCI కీలక నిర్ణయాలు.. లైంగిక వేధింపులపై కొత్త కమిటీ, IPL 2027పై ఫోకస్
-
Indonesia: వివాహేతర సంబంధం.. మహిళకు 100 కొరడా దెబ్బలు శిక్ష.. దయ చూపండంటున్నా..
-
Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..