NTV Telugu Site icon

Finger ice cream: ఐస్‌క్రీమ్‌లో మనిషి వేలు.. ఎవరిదో కనుక్కున్న ఫోరెన్సిక్ నిపుణులు..

Finger Ice Cream

Finger Ice Cream

Finger ice cream: ఇటీవల ముంబైలో ఓ డాక్టర్ ఆర్డర్ చేసిన ఐస్‌క్రీమ్‌లో మనిషి వేలు రావడం దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ముంబైలోని మలాడ్ ప్రాంతంలోని ఐస్‌క్రీం కోన్‌‌లో తెగిన వేలు కనిపించింది. ఈ విషయం పెద్ద ఎత్తున వైరల్ కావడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. వేలు ఎవరిదో కనుక్కునేందుకు దానిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపారు.

Read Also: Vande Bharat Express: వందేభారత్, గతిమాన్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేగం 130 కి.మీకి తగ్గింపు..

వేలికొనై ఉన్న డీఎన్ఏ ఐస్‌క్రీం ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఉద్యోగి ఓంకార్ పోటేదిగా తేలిందని పోలీసులు గురువారం తెలిపారు. ఇందాపూర్ ఫ్యాక్టరీలో కోన్‌లో ఐస్‌క్రీం నింపే సమయంలో ఓంకార్ వేలిలో కొంత భాగం కట్ అయింది. ఇది ఆ తర్వాత ఐస్‌క్రీం కొన్‌లో పడిపోయింది. జూన్ 12, 2024న మలాడ్‌లోని ఓర్లెమ్ నివాసి అయిన డాక్టర్ బ్రెండన్ ఫెర్రావ్ ఆన్‌లైన్ యాప్ ద్వారా మూడు ఐస్ క్రీమ్ కోన్‌లను ఆర్డర్ చేసినప్పుడు ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.

ఆర్డర్ చేసిన దాంట్లో ఒకటి యమ్మో బ్రాండ్ బటర్ స్కాచ్ ఐస్‌క్రీం ఉంది. దీనిపై డాక్టర్ ఫెర్రాన్ మాట్లాడుతూ..‘‘ నేను ఐస్ క్రీం మధ్యలోకి రాగానే, అకస్మాత్తుగా నాకు అక్కడ పెద్ద ముక్క అనిపించింది. మొదట్లో, అది పెద్ద గింజ అని నేను అనుకున్నాను. అదృష్టవశాత్తూ, నేను తినలేదు. అయితే, దానిని దగ్గరగా చూసిన తర్వాత, నేను దానిపై ఒక గోరును చూశాను.’’ అని చెప్పారు. ఈ ఘటనతో షాక్‌కి గురయ్యానని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. దీంతో యమ్మో ఐస్ క్రీం కంపెనీపై కేసు నమోదు చేసి ఐస్ క్రీం శాంపిళ్లను ఫోరెన్సిక్ విచారణకు పంపారు.

Show comments