Site icon NTV Telugu

Central Funds: ఏపీ, యూపీ సహా ఈ రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్‌..

Central Funds

Central Funds

ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌ సహా నాలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్‌ చెప్పింది కేంద్ర ప్రభుత్వం… పట్టణాల అభివృద్ధి కోసం రాష్ట్రాలకు కేంద్రం ఆర్థిక సహాయం ప్రకటించింది… ఈ విడతలో ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్రలోని పట్టణ స్థానిక సంస్థల విభాగం కింద కేంద్రం ఆర్ధిక సహాయం చేసింది… ఆంధ్రప్రదేశ్‌కి తాజాగా రూ.136 కోట్లు విడుదల చేసింది కేంద్రం.. రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం అభివృద్ధి కోసం కేంద్ర ఈ సహాయం చేసింది… 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఇప్పటి వరకు దేశంలోని పలు ప్రధాన పట్ణణాల అభివృద్ధి కోసం కేంద్రం 4,761 కోట్ల రూపాయల ఆర్ధిక సహాయం చేస్తూ వచ్చింది.. ఏపీకి ఇప్పటి వరకు 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను 293.75 కోట్ల రూపాయల కేంద్రం ఆర్ధిక సహాయం విడుదల చేసింది.. ఇక, తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటివరకు 331.40 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేసింది కేంద్రంలోని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం..

Read Also: Botsa Satyanarayana: పవన్‌ చేసిన పనికి నేనే గంటన్నర పాటు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయా..!

మొత్తంగా మిలియన్ ప్లస్ అర్బన్ సిటీలకు గ్రాంట్లు అందించడానికి నాలుగు రాష్ట్రాలకు ఆర్థిక మంత్రిత్వ శాఖ రూ.1,764 కోట్లు విడుదల చేసింది. మొత్తం సొమ్ములో ఆంధ్రప్రదేశ్‌కు 136 కోట్ల రూపాయలు, ఛత్తీస్‌గఢ్‌కు 109 కోట్ల రూపాయలు, మహారాష్ట్రకు 799 కోట్ల రూపాయలు, ఉత్తరప్రదేశ్‌కు 720 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం, ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ భిలాయ్‌నగర్ మరియు రాయ్‌పూర్, మహారాష్ట్రలోని ఔరంగాబాద్, గ్రేటర్ ముంబై, నాగ్‌పూర్ నాసిక్, పూణే మరియు వసాయి-విరార్ సిటీలకు గ్రాంట్ విడుదల చేయబడింది. ఇక, ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా, అలహాబాద్, ఘజియాబాద్, కాన్పూర్‌లకు నిధులు మంజూరు చేయబడింది. లక్నో, మీరట్ మరియు వారణాసి కూడా ఈ జాబితాలో ఉన్నాయి.. 15వ ఆర్ధిక సంఘం సిఫార్సుల్లో భాగంగా ఈ నిధులను విడుదల చేసింది కేంద్రం. వరుసగా రాష్ట్రాలకు నిధులు విడుదల చేస్తూ వస్తున్న కేంద్రం.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, ఛత్తీస్‌ఘడ్‌, మహారాష్ట్రలకు ప్రత్యేకంగా నిధులు రిలీజ్‌ చేసింది.

Exit mobile version