Site icon NTV Telugu

Modi-Rabuka: ఎవరో మీతో సంతోషంగా లేరు.. మోడీతో ఫిజీ ప్రధాని వ్యాఖ్య

Pmmodi

Pmmodi

ఫిజీ ప్రధాని రబుకా మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతో ఫిజీ ప్రధాని రబుకా బృందం ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. సోమవారం నాడు వాణిజ్యం, పెట్టుబడులు వంటి రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చలు జరిపినట్లు వర్గాలు పేర్కొన్నాయి.

ఇది కూడా చదవండి: PM Modi: రేపు 2 దేశాల పర్యటనకు వెళ్లనున్న మోడీ

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ (ICWA) నిర్వహించిన సప్రూ హౌస్‌లో ‘ఓషన్ ఆఫ్ పీస్’ అనే అంశంపై ఉపన్యాసం ఇచ్చిన తర్వాత జరిగిన సంభాషణలో రబుకా.. మోడీతో మాట్లాడుతూ.. ఎవరో ‘‘మీతో సంతోషంగా లేరు’’ అని, ‘‘మీరు ఆ అసౌకర్యాలను తట్టుకునేంత పెద్దవారు.’’ అని వ్యాఖ్యానించారు. భారత్‌పై ట్రంప్ 50 శాతం సుంకం విధించడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీతో ఫిజీ ప్రధాని రబుకా ఈ విధంగా సంభాషించారు.

ఇది కూడా చదవండి: UP: సీఎం యోగి సరికొత్త నిర్ణయం.. 7 నగరాల్లో ట్రాఫిక్ కంట్రోల్ కోసం ఏం చేశారంటే..!

అమెరికా అధ్యక్షుడితో తనకు ఎలాంటి వ్యక్తిగత సంభాషణ లేదని.. రష్యా అధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చలు జరపాలని కోరానని ఆయన అన్నారు. ప్రధాని మోడీ మా భావాలను, భావనను అర్థం చేసుకున్నారని రబుకా పేర్కొన్నారు. భారతదేశం ఒక ముఖ్యమైన భాగస్వామి అని.. శాంతి మహాసముద్రంగా పసిఫిక్ దార్శనికత మన ప్రాంతానికి మాత్రమే కాకుండా ప్రపంచ శాంతి, స్థిరత్వానికి దోహదపడేలా ఫిజీ, భారతదేశం కలిసి పనిచేయగలవు అని ఫిజీ ప్రధాని రబుకా అన్నారు.

దక్షిణ పసిఫిక్ దేశమైన ఫిజీ. సముద్ర భద్రత రంగంలో భారతదేశానికి ముఖ్యమైనది. రెండు దేశాలు బలమైన సాంస్కృతిక మరియు ప్రజల మధ్య సంబంధాలను కలిగి ఉన్నాయి.

Exit mobile version