Fight In Marriage Between Bride And Groom Families For Photos In Uttar Pradesh: ‘ముక్క’ దొరకలేదన్న కోపంతో వధూవరుల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరగడం, వ్యవహారం పెళ్లి ఆగిపోయేదాకా వెళ్లడం లాంటి సంఘటనల్ని మనం ఎన్నో చూశాం. కేవలం ముక్క కోసమే కాదు, ఇంకా మరెన్నో కారణాలతో ఇరు కుటుంబాలు భౌతిక దాడులు చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే.. లేటెస్ట్‌గా ఫోటోల కోసం బంధువులు కొట్టుకున్న మరో విచిత్రమైన సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. మేమంటే మేము ముందు ఫోటోలు దిగుతామంటూ వాదనకు దిగి.. చివరికి ఒకరిపై మరొకరు దాడి చేసుకునేదాకా వ్యవహారం వెళ్లింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Team India: బీసీసీఐకి షాక్.. సంజు శాంసన్‌కు ఇతర దేశం నుంచి ఆఫర్
ఉత్తరప్రదేశ్‌లోని దేవ్‌రియా జిల్లా మాధవ్‌పూర్ గ్రామానికి చెందిన ఒక అబ్బాయికి అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయితో పెళ్లి నిశ్చయమైంది. ఈ పెళ్లి వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు అబ్బాయి, అమ్మాయి తరఫు బంధువులు బాగానే వచ్చారు. వరమాల పూర్తయ్యేంతవరకు అక్కడి వాతావరణం ప్రశాంతంగానే ఉంది. అందరూ బాగానే పలకరించుకుంటూ, సరదాగానే గడిపారు. కానీ, వరమాల పూర్తైన వెంటనే అసలు డ్రామా మొదలైంది. మేమంటే మేము ఫోటోలు దిగుతామంటూ ఇటు అబ్బాయి వారు, అటు అమ్మాయి వాళ్ల మధ్య వాదన మొదలైంది. అయితే, తాగి ఉన్న అబ్బాయి బంధువులు.. ‘‘మేం అబ్బాయి వాళ్లం, మేమే ముందుగా ఫోటోలు దిగుతాం’’ అంటూ గట్టిగా వారించారు.
Tirupathi: తుఫాన్ ధాటికి పోలీస్ స్టేషన్‌లోకి నీళ్లు.. వీడియో వైరల్
ఈ క్రమంలోనే ఈ వాదనలు.. భౌతిక దాడులు చేసుకునే దాకా వెళ్లాయి. వీరిని అదుపు చేసేందుకు అక్కడున్న పెద్దలు ప్రయత్నించినా.. ‘తగ్గేదే లే’ అంటూ ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. ఈ గొడవల్లో ఇరుపక్షాల వారికీ తీవ్ర గాయాలయ్యాయి. అబ్బాయి సోదరి కూడా ఈ గొడవల్లో గాయపడింది. ఫైనల్‌లో పోలీసులు రంగంలోకి దిగడంతో.. పరిస్థితి అదుపులోకి వచ్చింది. గాయపడిన వారిని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో తీవ్ర మనస్థాపానికి గురైన అబ్బాయి, మొదట్లో తాళి కట్టేందుకు ససేమిరా అన్నాడు. చివరకు మనసు మార్చుకొని, తాళి కట్టడంతో కథ సుఖాంతం అయ్యింది. ఈ ఘటన డిసెంబర్ 8వ తేదీన చోటు చేసుకుంది.