Site icon NTV Telugu

India-Pakistan War: ఫవాద్ ఖాన్, అతిఫ్ అస్లాం ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ బ్లాక్..

Fahad

Fahad

India-Pakistan War: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్- పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో దాయాది దేశానికి చెందిన కళాకారులు, ప్రముఖులకు సంబంధించిన యూట్యూబ్, సోషల్ మీడియా అకౌంట్లను భారతదేశం బ్లాక్ చేస్తుంది. ఈ సందర్భంగా పాక్ నటుడు ఫవాద్ ఖాన్, గాయకుడు అతిఫ్ అస్లాంల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను నిలిపివేయబడింది. దీంతో ఈ ఇద్దరు పాకిస్తానీ కళాకారుల అకౌంట్స్ భారతదేశంలో ఇక నుంచి కనిపించవని పేర్కొన్నారు. చట్టపరంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంస్టాగ్రామ్ వెల్లడించింది.

Read Also: GT vs SRH: మ్యాచ్ గెలిచి ప్లేఆఫ్ రేసులో ఎస్ఆర్ఎచ్ నిలుస్తుందా? మొదట బ్యాటింగ్ చేయనున్న జీటి

అయితే, 2014లో సోనమ్ కపూర్ సరసన “ఖూబ్‌సూరత్” చిత్రంలో నటించడం ద్వారా ఫవాద్ ఖాన్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. “కపూర్ & సన్స్”, “ఏ దిల్ హై ముష్కిల్” లాంటి ఇతర చిత్రాలలో కీలక పాత్ర పోషించాడు. పహల్గామ్ దాడి తర్వాత అతడు తాజాగా నటించిన చిత్రం “అబీర్ గులాల్” విడుదల కూడా సందిగ్ధంలో పడింది. మరోవైపు, తూ జానే నా, తేరా హోనే లగా హూన్ (రెండూ అజబ్ ప్రేమ్ కి గజబ్ కహానీ), పెహ్లీ నాజర్ మే (రేస్) లాంటి ప్రముఖ బాలీవుడ్ ట్రాక్‌లను అతిఫ్ అస్లాం స్వరాలు అందించాడు. ఇతను అనేక అవార్డులను గెలుచుకోవడంతో పాటు పలుమార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డులకు కూడా నామినేట్ అయ్యాడు.

Read Also: Congress vs BJP: ఆ కాంగ్రెస్ ఎంపీ పిల్లలు భారతీయులు కాదు.. మండిపడిన హస్తం పార్టీ!

కాగా, వీరితో పాటు మహిరా ఖాన్, హనియా అమీర్, అలీ జాఫర్ లాంటి అనేక మంది పాకిస్తానీ కళాకారుల సోషల్ మీడియా అకౌంట్లను భారతదేశం బ్లాక్ చేసింది. అలాగే, పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్, బాబర్ అజామ్, షోయబ్ మాలిక్ లకి చెందిన యూట్యూబ్ ఛానల్స్ ను సైతం తొలగిస్తున్నట్లు ఇండియన్ గవర్నమెంట్ ప్రకటించింది.

Exit mobile version