Funeral Rituals for Daughter : ప్రేమికుడితో వెళ్లిపోయిన యువతి.. బతికుండగానే శవయాత్ర చేసిన తండ్రి
- ప్రేమ మత్తులో పడి కన్నవాళ్లను వదిలేస్తున్న యువతీ యువకులు
- మధ్యప్రదేశ్ లో బతికి ఉండగానే కూతురికి శవయాత్ర చేసిన కన్నతండ్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేమ మత్తులో పడి కొందరు యువతీ యువకులు కన్నవారిని వదిలి తమ ప్రియుడు లేదా ప్రియురాలితో వెళ్లిపోతున్నారు. ఇలాంటి ఘటనలు తల్లిదండ్రులకు తీరని వేదనను మిగులుస్తున్నాయి. అలాంటి హృదయవిదారక సంఘటనే మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. తన కూతురు ప్రేమించిన యువకుడితో ఇంటి నుంచి వెళ్లిపోయిందన్న విషయం తండ్రిని తీవ్రంగా కలచివేసింది. దీంతో అతడు బ్రతికి ఉండగానే కూతరు చనిపోయిందని.. ఓ పిండిముద్దతో తన కూతురికి శవయాత్ర నిర్వహించాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే, మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి తన కూతురు కనిపించకపోవడంతో సమీప పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ చేపట్టగా, ఆ యువతి ఓ యువకుడిని ప్రేమించి అతడితో వివాహం చేసుకుని వెళ్లిపోయినట్టు గుర్తించారు. ఈ విషయాన్ని పోలీసులు తండ్రికి తెలియజేయడంతో ఆయన తీవ్ర ఆవేశానికి లోనయ్యాడు. సమాజంలో తన కూతురు తనకు లేనట్టే అని భావించిన తండ్రి, కూతురు రూపాన్ని పిండి ముద్దగా తయారు చేయించి, ఆమె చనిపోయినట్టుగా గ్రామస్థులు, బంధువులకు ప్రకటించాడు. అనంతరం ఆమెకు శవయాత్ర కూడా నిర్వహించాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Also Read
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్‌కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
In a deeply emotional incident from #Vidisha, #MadhyaPradesh, a family declared their daughter dead after she eloped with her lover and married him secretly.
Unable to accept her decision, the family made an effigy, took out a funeral procession through the city, and performed… pic.twitter.com/bpu5MymqGd
— Hate Detector 🔍 (@HateDetectors) December 22, 2025
తాజావార్తలు
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్‌కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
-
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!