NTV Telugu Site icon

Rohit Bal: ముగిసిన రోహిత్ బాల్ అంత్యక్రియలు.. హాజరైన నటులు, ప్రముఖులు

Rohitbal

Rohitbal

ప్రముఖ భారతీయ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ (63) అంత్యక్రియులు ఢిల్లీలోని లోధీ రోడ్ శ్మశానవాటికలో ముగిశాయి. అంత్యక్రియలకు ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు సునీల్ సేథీ, నటుడు అర్జున్ రాంపాల్, ఫ్యాషన్ డిజైనర్లలో ఒకరైన వరుణ్ బహల్, వరుణ్ బహ్ల్, రోహిత్ గాంధీ, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా బాలీవుడ్ నటులు సంతాపం వ్యక్తం చేశారు. రోహిత్ బాల్ 63 సంవత్సరాల వయస్సులో గుండెపోటుతో దక్షిణ ఢిల్లీ ఆసుపత్రిలో శుక్రవారం రాత్రి మరణించారు. శనివారం లోధి రోడ్ శ్మశానవాటికలో అతని అంత్యక్రియలు జరిగాయి. అంతకముందు అంతిమ యాత్రలో ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

ఇది కూడా చదవండి: CM Chandrababu: రెండు మూడు రోజుల్లో రాష్ట్ర భవిష్యత్తును మార్చే కొత్త ప్రణాళిక

ఇక భౌతికకాయాన్ని ఆస్పత్రి నుంచి డిఫెన్స్ కాలనీలో ఆయన నివాసంలో ఉంచారు. అక్కడ పలువురు ప్రముఖులు చివరి నివాళులు అర్పించారు. బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియాలో బాల్‌కు నివాళులు అర్పించారు. రోహిత్ బాల్‌తో ఉన్న అనుబంధాలను నటులు గుర్తుచేసుకున్నారు.

ఈ సంవత్సరం అక్టోబర్‌లో అనన్య పాండే షో-స్టాపర్‌గా ఉన్న లాక్మే ఫ్యాషన్ వీక్ X FDCI 2024 గ్రాండ్ ఫినాలేలో రోహిత్ బాల్ తన ఫ్యాషన్ డిజైన్లతో ఆకట్టుకున్నారు. వారిద్దరూ కలిసి రన్‌వేపై నడుస్తున్న ఫొటోను సుస్మితా సేన్ పోస్ట్ చేసింది. “ఎంత లొంగని ఆత్మ & ఎంత మార్గదర్శకుడు!! ప్రశాంతంగా ఉండండి #rohitbal,” అని ఆమె క్యాప్షన్ ఇచ్చింది.

ఇది కూడా చదవండి: Cauliflower: క్యాలీఫ్లవర్ తింటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి..

Show comments