Farooq Abdullah: ఆర్టికల్ 370 కోసం ఉద్యమిస్తాం.. ఫరూఖ్ అబ్దుల్లా కీలక ప్రకటన!
- ఆర్టికల్ 370 పునరుద్ధరణ, రాష్ట్ర హోదా కోసం పోరాటం
- కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు
- “హక్కులు కోరడం దేశవ్యతిరేకం కాదు” అని ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farooq Abdullah: ఆర్టికల్ 370 పునరుద్ధరణ, జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా తిరిగి కల్పించాలనే డిమాండ్లపై తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని నేషనల్ కాన్ఫరెన్స్ (NC) అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలు తమ హక్కులు, ప్రత్యేక గుర్తింపును కాపాడుకునేందుకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
శనివారం బారాముల్లాలోని డాక్ బంగ్లాలో పార్టీ కార్యకర్తలతో మాట్లాడిన ఆయన.. ప్రజలు ఐక్యంగా ఉండి తమ హక్కుల కోసం పోరాడాలని అన్నారు. ‘‘మనకు ధైర్యం ఉంటే మనం వారితో పోరాడుతాం.. లేకపోతే తుడిచిపెట్టుకుపోతాం’’ అని కార్యకర్తల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. విభేదాలను పక్కన పెట్టి ఐక్యంగా ముందుకు సాగితే విజయం సాధించొచ్చని అన్నారు.
Also Read
జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక గుర్తింపును బీజేపీ, కేంద్ర ప్రభుత్వం బలహీనపరుస్తోందని ఫరూఖ్ అబ్దుల్లా విమర్శించారు. ఆర్టికల్ 370 కోసం తమ పార్టీ పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. తమ హక్కుల కోసం పోరాడటం దేశానికి వ్యతిరేకం కాదని అన్నారు. ‘‘తాము గాంధీ-నెహ్రూల భారతదేశానికి చెందిన వాళ్లం, మా దేశభక్తిని ఎందుకు ప్రశ్నిస్తున్నారు’’ అని అన్నారు. తమ హక్కులు, డిమాండ్లను దేశవ్యతిరేక చర్యగా చిత్రీకరించడం సరికాదని అన్నారు.
తాజావార్తలు
-
Farooq Abdullah: ఆర్టికల్ 370 కోసం ఉద్యమిస్తాం.. ఫరూఖ్ అబ్దుల్లా కీలక ప్రకటన!
-
Cyclone Arnab : ఉత్తర కోస్తాకు ముంచుకొస్తున్న ‘అర్ణబ్’ తుఫాన్ ముప్పు..
-
Pashamylaram Drug Raid: తెలంగాణలో భారీగా డ్రగ్స్ ముడిసరుకు ఫ్యాక్టరీ గుట్టురట్టు..
-
India vs New Zealand: కివీస్ గడ్డపై తెలుగోళ్ల విధ్వంసం.. భారత్ ఖాతాలో మరో రికార్డ్ విక్టరీ!
-
Himanta Biswa Sarma: 57 ఏళ్ల వ్యక్తి Gen Zనా? రాహుల్ గాంధీపై హిమంత సెటైర్లు..
ట్రెండింగ్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!