NTV Telugu Site icon

Delhi March: నేటి మధ్యాహ్నం చలో ఢిల్లీకి రైతుల సంఘాల పిలుపు.. సరిహద్దుల్లో ఉద్రిక్తత

Delhi

Delhi

Delhi March: పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం లాంటి పలు డిమాండ్లతో రైతు సంఘాలు నేడు మరోసారి చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ మేరకు రైతులు రెడీ అవుతున్నారు. ఢిల్లీ చేరుకునేందుకు సన్నాహాలు మొదలు పెట్టారు. ఇందులో భాగంగా రైతులు, రైతు సంఘాల నేతలతో కూడిన 101 మంది ఈరోజు మధ్యాహ్నం మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇక, రైతుల కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికే ఢిల్లీ సరిహద్దుల్లో బారికేడ్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు.

Read Also: Allu Arjun: అల్లు అర్జున్ నివాసానికి దిల్ రాజు, కొరటాల

మరోవైపు.. రైతుల మార్చ్‌ పై హర్యానా సర్కార్ కూడా అంబాలా జిల్లాలో తాత్కాలికంగా ఇంటర్నెట్‌ సేవలు, మొబైల్‌ ఎస్‌ఎంఎస్‌ సేవలను ఆపేసింది. నేటి నుంచి ఈ నెల 17వ తేదీ వరకు ఈ సేవలను బంద్ చేస్తున్నట్లు అధికారులు చెప్పుకొచ్చారు. అత్యవసర సేవలు కొనసాగుతాయని తెలిపారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకుడు సర్వన్‌ సింగ్‌ పంధేర్‌ మాట్లాడుతూ.. రైతులు ఆందోళనలు చేపట్టి ఈరోజుకి 307 రోజులు అవుతుందని చెప్పుకొచ్చారు. పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని తాము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఈ క్రమంలోనే రైతు మార్చ్‌ తలపెట్టామని వెల్లడించారు.

Read Also: Crime News: హషీమ్ బాబా గ్యాంగ్ షూటర్ సోనూ మట్కా ఎన్‌కౌంటర్‌..

అయితే, దేశం మొత్తం రైతులకు అండగా నిలుస్తున్నా.. ప్రధాని మోడీ మాత్రం సైలెంట్ గా ఉంటున్నారని రైతు సంఘాల నేతలు విమర్శించారు. ఇప్పటికే రెండు సార్లు రైతులు ఢిల్లీ చలో కార్యక్రమానికి పిలుపునివ్వగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తతలు జరగడంతో.. రైతులపై పోలీసులు బష్ప వాయువును ప్రయోగించారు. ఈ సందర్బంగా పలువురు రైతులు, రైతు సంఘాల నాయకులు తీవ్రంగా గాయపడ్డారు.

Show comments