Fake Currency: ఎంఎన్ సీ కంపెనీలో జాబ్.. ఏడాదికి రూ.42 లక్షల శాలరీ.. హోటల్ లో ఫేక్ కరెన్సీ ప్రింట్ చేస్తున్న టెకీ..
- హై-పే ఐటీ ప్రొఫెషనల్
- ఏడాదికి రూ.42 లక్షల శాలరీ
- హోటల్ లో ఫేక్ కరెన్సీ ప్రింట్ చేస్తున్న టెకీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హై-పే ఐటీ ప్రొఫెషనల్ రెండు రోజులు హోటల్ రూమ్ ను లాక్ చేసి వెళ్లడం ఫేక్ కరెన్సీ కేసుకు దారి తీసింది. నోయిడాలోని ఒక మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తూ ఏడాదికి రూ.42 లక్షల వేతనం అందుకుంటున్న వినాయక్ ఝా అనే ఐటీ ఇంజనీర్‌ను ఫరీదాబాద్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. హోటల్ రూమ్‌లో ఫేక్ కరెన్సీ ప్రింటింగ్ సెటప్ బయటపడింది. ఈ కేసు ఐటీ సెక్టార్లో ఉన్నత వేతనాలు అందుకుంటున్న యువకులు కూడా ఇలాంటి నేరాలకి ఎందుకు పాల్పడుతున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
సంఘటన ఎలా జరిగింది?
వినయక్ ఝా జూన్ 26న ఫరీదాబాద్‌లోని సురజ్కుండ్లో ఉన్న అప్స్కేల్ హోటల్ సరోవర్ పోర్టికోలోని రూమ్ నంబర్ 404-Bలో చెక్-ఇన్ అయ్యాడు. కానీ రెండు రోజులు గడిచినా రూమ్ నుంచి ఎలాంటి కదలిక లేదు. రెండు రోజులైనా బయటకు రాకపోవడం, గదికి తాళం వేసి కీలు తనతోనే తీసుకెళ్లడంతో హోటల్ సిబ్బందికి అనుమానం వచ్చింది. వెంటనే సురజ్కుండ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు హోటల్ సిబ్బంది సహాయంతో రూమ్‌ను తెరిచి సెర్చ్ చేశారు.
Also Read
- UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
- Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్‌కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
- Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
- Nepal Floods: నేపాల్ విలయం.. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 400 మంది గల్లంతు..
రూమ్ ఖాళీగా ఉన్నా, లోపల ల్యాప్‌టాప్, ప్రింటర్, కరెన్సీ ప్రింటింగ్‌కు ఉపయోగపడే స్పెషల్ A4 పేపర్, ఒక రూ.500 ఫేక్ నోటు, 10 రూ.100 ఫేక్ నోట్లు, ఇతర సామగ్రి లభ్యమయ్యాయి. హోటల్లో సమర్పించిన ఐడెంటిటీ డాక్యుమెంట్ల ఆధారంగా పోలీసులు అతన్ని ఫరీదాబాద్ సెక్టార్ 17లోని తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి అరెస్టు చేశారు. పోలీసులు అతన్ని రెండు రోజుల పోలీస్ రిమాండ్‌కు తీసుకున్నారు. కేసును NIT క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి, తల్లి కూడా ప్రభుత్వ ఉన్నత స్థాయి ఉద్యోగిని వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల దర్యాప్తు
ల్యాప్‌టాప్, ప్రింటర్లను ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు. ఇంతకు ముందు ఎంత ఫేక్ నోట్లు ప్రింట్ చేశాడో తెలుసుకునేందుకు పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఒక్కడే నడిపాడా లేదా పెద్ద నెట్వర్క్ లో భాగమా? ఎక్కడి నుంచి సామగ్రి కొన్నాడు? ఎవరైనా సహాయం చేశారా? హోటల్ CCTV ఫుటేజ్ పరిశీలన. అతని గత చరిత్ర, తల్లిదండ్రుల ఉద్యోగాల వివరాలపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు. BNS సెక్షన్లు 178 & 181 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
- Tags
- Fake Currency
- Faridabad
తాజావార్తలు
-
OTR: టీడీపీకి మింగుడుపడని ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాలు
-
Trump: మోజ్తబా ఖమేనీ చనిపోయడని అనుకోవట్లేదు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
OTR: నిజామాబాద్ కాంగ్రెస్‌లో ‘పెద్దాయన’కు కొత్త చిక్కులు!
-
Car Malware Alert: కార్లకు సైబర్ షాక్.. ప్రపంచంలోనే తొలి ‘కార్ మాల్వేర్’ గుర్తింపు!
-
UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..