Mercy killing: పుట్టుకతోనే అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతున్న తమ ఇద్దరు పిల్లలతో పాటు తమకు కారుణ్య మరణాన్ని ప్రసాదించాలంటూ కేరళకు చెందిన ఐదుగురు సభ్యుల కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించబోతున్నారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఇద్దరు పిల్లల చికిత్సను కొనసాగించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని కుటుంబీలకు చెప్పారు. కేరళలోని కొట్టాయం జిల్లాకు చెందిన కుటుంబంలోని ఐదుగురు ‘మెర్సి కిల్లింగ్’ కోరుతూ భారత అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు.
Read Also: Vice Chancellors: తెలంగాణలోని 10 వర్సిటీలకు వీసీల నియామకం.. నోటిఫికేషన్ విడుదల
కోజికోడ్ జిల్లా కోజువనల్‌కి చెందిన స్మిత ఆంటోనీ, మను జోసెఫ్ దంపతుల ముగ్గురు పిల్లల్లో ఇద్దరు ‘‘సాల్ట్-వేస్టింగ్ కన్జెనిటర్ అడ్రినల్ హైపర్‌ప్లాసియా(SWCAH)’’తో బాధపడుతున్నారు. వీరి చికిత్సను ముందుకు తీసుకెళ్లడానికి మార్గం కనిపించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు వెల్లడించారు. సాల్ట్ వేస్టింగ్ అనేది కన్జెనిటల్ అడ్రినల్ హైపర్‌ప్లాసియా తీవ్రమైన రూపం. ఇది ముఖ్యమైన హార్మోన్ల ఉత్పత్తి చేసే అడ్రినల్ గ్రంధులపై తీవ్ర ప్రభావం చూపే జన్ముపరమైన రుగ్మత.
తాను తన భర్త వృత్తి రీత్యా నర్సులమైనప్పటికీ, తమ పిల్లలకు పూర్తి సమయం సంరక్షణ అవసరం దీంతో తాము పనికి వెళ్లలేకపోయారని స్మిత చెప్పారు. తమ పిల్లల చికిత్స కోసం ఇప్పటికే ఆస్తులు తాకట్టు పెట్టామని చెప్పారు. మా రోజూవారీ ఖర్చల కోసం, చికిత్స కోసం తాము చాలా కష్టపడుతున్నట్లు తెలిపారు. ఉద్యోగం, వైద్యం కోసం స్థానిక పంచాయతీని ఆశ్రయించినప్పటికీ.. ఎలాంటి సాయం లభించలేదని చెప్పారు. తనకు ఉద్యోగం ఇవ్వాలని పంచాయతీ నిర్ణయించినప్పటికీ, కార్యదర్శి నిర్లక్ష్యం వల్ల తనకు జాబ్ రాలేదరి చెప్పారు. మానవహక్కుల సంఘం జోక్యంతో ఫైలును ప్రభుత్వానికి పంపినా.. ఉద్యోగంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. తమ కుటుంబానికి ’’మెర్సికిల్లింగ్’’ వేరే మార్గం లేదని, అందుకే సుప్రీంకోర్టు ఆశ్రయించబోతున్నట్లు చెప్పారు.