West Bengal repolling: బెంగాల్లో మళ్లీ ఎన్నికల వేడి.. ఫల్తాలో రీ-పోలింగ్ షురూ! అసలు ట్విస్ట్ ఇదే..
- ఉదయం 7 గంటలకే ప్రారంభమైన ఓటింగ్
- మొత్తం 285 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్
- మే 24న ఎన్నికల ఫలితాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal repolling: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న 24 పరగణాల జిల్లాలోని ‘ఫల్తా’ అసెంబ్లీ నియోజకవర్గానికి నేడు (గురువారం) భారీ భద్రత నడుమ రీ-పోలింగ్ జరుగుతోంది. మొత్తం 285 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటలకే ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే పోలింగ్ స్టార్ట్ కావడానికి కేవలం రెండు రోజుల ముందే ఇక్కడ ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీకి కంచుకోటగా భావించే ఈ స్థానంలో.. ఆ పార్టీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ మంగళవారం ఆకస్మికంగా తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేశారు. ఈ ఆకస్మిక మలుపుతో ఫల్తా నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మే 24న ఈ స్థానానికి సంబంధించిన ఫలితాలను ప్రకటించనున్నారు.
కట్టుదిట్టమైన భద్రత
వాస్తవానికి ఈ స్థానానికి ఏప్రిల్ 29నే పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే ఆ సమయంలో పెద్ద ఎత్తున అక్రమాలు, అవకతవకలు జరిగాయనే ఆరోపణలు రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆ ఎన్నికను రద్దు చేసి, నేడు పూర్తిస్థాయి పునః పోలింగ్‌కు ఆదేశించింది. ఉదయం రీ-పోలింగ్ ప్రారంభానికి ముందు నిబంధనల ప్రకారం బూత్‌లలో మాక్ పోలింగ్ నిర్వహించారు. గతంలో జరిగిన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి ఎన్నికల సంఘం అన్ని బూత్‌ల వద్ద మునుపటి కంటే రెట్టింపు స్థాయిలో కేంద్ర బలగాలతో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.
Also Read
- Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
- S. Jaishankar: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అనిశ్చితి.. బ్రిక్స్ దేశాలకు జైశంకర్ కీలక సందేశం
- DILRMP 3.0: ఇకపై మీ భూమికి కూడా 'ఆధార్' లాంటి నెంబర్.. కేంద్రం సరికొత్త పథకం ప్రారంభం.!
- Sabita Indra Reddy: చీర లాగారు.. కింద పడేసి తొక్కారు.. జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశాం..
అభిషేక్ బెనర్జీకి గట్టి ఎదురుదెబ్బ..
ఫల్తా అసెంబ్లీ స్థానం టీఎంసీ అగ్రనేత, ఎంపీ అభిషేక్ బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న డైమండ్ హార్బర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఇక్కడి నుంచి తప్పుకున్న జహంగీర్ ఖాన్‌కు ఈ ప్రాంతంలో బలమైన పట్టు ఉంది. అంతేకాకుండా ఆయనను అభిషేక్ బెనర్జీకి అత్యంత ఆప్తుడిగా భావిస్తారు. గత లోక్‌సభ ఎన్నికల్లో జహంగీర్ ఖాన్ పోషించిన కీలక పాత్ర వల్లే అభిషేక్ బెనర్జీ డైమండ్ హార్బర్ నుంచి 7,10,930 ఓట్ల రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధించారని చెబుతున్నారు. అలాంటి కంచుకోట లాంటి స్థానంలో, పోలింగ్‌కు సరిగ్గా రెండు రోజుల ముందు ఆయన పోటీ నుంచి టీఎంసీకి, ముఖ్యంగా అభిషేక్ బెనర్జీకి రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బీజేపీ విజయం ఖాయమేనా?
టీఎంసీ రేసు నుంచి తప్పుకోవడంతో ఇప్పుడు ప్రధాన పోటీ భారతీయ జనతా పార్టీ (BJP) అభ్యర్థి దేబాంగ్షు పాండా, కాంగ్రెస్‌కు అభ్యర్థి అబ్దుర్ రజాక్ మొల్లా మధ్యే పోరు ఉందని తెలుస్తోంది. వీరితో పాటు సీపీఐ(ఎం) అభ్యర్థి శంభునాథ్ కుర్మి, స్వతంత్ర అభ్యర్థులు దీప్ హతి, చంద్రకాంత్ రాయ్ కూడా బరిలో ఉన్నారు. అయితే బలమైన ప్రత్యర్థి అయిన టీఎంసీ అభ్యర్థి తప్పుకోవడంతో ఇక్కడ బీజేపీ విజయం దాదాపు ఖాయమనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ స్థానంలో దేబాంగ్షు పాండా గెలిస్తే.. బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ మొత్తం సీట్ల సంఖ్య 208 మార్కుకు చేరుకుంటుంది. దీంతో ఈ రీ-పోలింగ్ ఫలితంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
Kuldeep Yadav: 10 వికెట్స్ పడగొట్టిన కుల్దీప్ యాదవ్.. గౌతమ్ గంభీర్ చూస్తున్నాడా?
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్‌కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav vs Ishan: క్రెడిట్ అంతా తీసుకున్నావ్.. వైభవ్ భవిష్యత్ కెప్టెన్.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Sunil Gavaskar: ఇంకెంతకాలం ఆటగాళ్లను పిండేస్తారు? ఐసీసీకి గవాస్కర్ సూటి ప్రశ్న
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!