NTV Telugu Site icon

Fake Job Racket: నకిలీ జాబ్స్ మోసం.. మయన్మార్ నుంచి 13మంది ఇండియన్స్ సేఫ్

Fake Job Scam

Fake Job Scam

13 Indians trapped in fake IT job racket rescued from Myanmar: నకిలీ జాబ్ రాకెట్ వలలో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా రక్షించారు. మయన్మార్ దేశంలో ఐటీ జాబ్స్ కోసమని వెళ్లారు 45 మంది భారతీయులు. అయితే అక్కడి వెళ్లాక కానీ తెలియలేదు తామంతా మోసపోయామని. మయన్మార్ లోని మైవడ్డీ ప్రాంతంలో అంతర్జాతీయ జాబ్ రాకెట్ బారిన పడిన 13 మంది భారతీయులను సురక్షితంగా రక్షించినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. వీరంతా బుధవారం తమిళనాడుకు చేరుకున్నారని ఆయన వెల్లడించారు.

గత నెలలో మయన్మార్, థాయ్ లాండ్ లోని భారతీయ మిషన్ల ద్వారా 32 మంది భారతీయులను మైవాడి నుంచి రక్షించారు. తాజాగా మరో 13 మందిని సురక్షితంగా ఇండియాకు తీసుకువచ్చారు. మయన్మార్ నకిలీ జాబ్ రాకెట్లలో చిక్కుకున్న వారిని సురక్షితంగా రక్షించామని.. ఇప్పటికే 32 మంది భారతీయులను రక్షించామని.. అరిందమ్ బాగ్చీ ట్వీట్ చేశారు.

Read Also: HD Kumaraswamy: కర్ణాటకలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో కలిసి పోటీ చేస్తాం

థాయ్ లాండ్ సరిహద్దుల్లోని ఆగ్నేయ మయన్మార్ లో కయిన్ రాష్ట్రంలోని మైవాడీ ప్రాంతం పూర్తిగా మయన్మార్ ప్రభుత్వం నియంత్రణలో లేదు. అక్కడ సాయుధ తిరుగుబాటు జరుగుతోంది. అయితే భారతీయులు మయన్మార్ లోకి అక్రమంగా ప్రవేశించారని అక్కడి అధికారులు వీరిని నిర్భంధంలోకి తీసుకున్నారు. దీంతో వీరందరిని విడిపించేందుకు భారత విదేశాంగ శాఖ ప్రయత్నాలు చేసింది. ప్రస్తుతం జాబ్ రాకెట్ తో సంబంధం ఉన్న అనేక మంది ఏజెంట్ల వివరాలను రాష్ట్రాల అధికారులతో పంచుకున్నామని బాగ్చీ వెల్లడించారు.

లావోస్, కంబోడియాలో కూడా ఇలాంటి జాబ్ రాకెట్ ఉదంతాలు వెలుగులోకి వచ్చాయని.. వియంటియాన్, నమ్ పెన్, బ్యాంకాక్ లో ఉన్న భారత రాయబార కార్యాలయాల సహకారంతో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు సహాయం చేస్తున్నామని ఆయన అన్నారు. మయన్మార్ తూర్పు సరిహద్దు ప్రాంతాల్లో డిజిటల్ స్కామింగ్, ఫోర్జ్ క్రిఫ్టో కార్యకలాపాలతో సంబంధం ఉన్న కొన్ని ఎల్టీ కంపెనీలు ఐటీ రంగంలో ఉపాధి అవకాశాల సాకుతో రిక్రూట్మెంట్ ఏజెంట్ల ద్వారా వివిధ ప్రాంతాల నుంచి భారతీయును రిక్రూట్ చేసుకుందని.. సరైన డాక్యుమెంటేషన్ లేకుండా వీరంతా వెళ్లడంతో అక్కడి అధికారులు నిర్భంధంలోకి తీసుకున్నారు.