Site icon NTV Telugu

Fact-check: భారత వైమానిక స్థావరాలపై పాకిస్తాన్ దాడి.. నిజం ఏంటంటే..

Indian Air Bases

Indian Air Bases

Fact-check: ఆపరేషన్ సిందూర్‌లో భారత దాడిని తట్టుకోలేక కాళ్ల బేరానికి వచ్చిన పాకిస్తాన్ ఇంకా తన బుద్ధి పోనిచ్చుకోవడం లేదు. 11వైమానిక స్థావరాలు , కీలక ఆయుధ వ్యవస్థలు నాశనమైనప్పటికీ తామే విజయం సాధించామంటూ ప్రగల్భాలకు పోతోంది. భారత్ చేతితో చావు దెబ్బ తిన్నప్పటికీ, విక్టరీ ర్యాలీల పేరుతో పాకిస్తాన్‌లోని ప్రముఖులు, ఆర్మీ సంతోష పడుతోంది. అక్కడి ప్రజల్ని బకరాలను చేయడానికి ఇదంతా చేస్తోంది.

ఇదిలా ఉంటే, తాము భారత వైమానిక స్థావరాలపై దాడులు చేశామంటూ కొన్ని పాకిస్తాన్ నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే, వీటిని జియో ఇంటెలిజెన్స్ నిపుణుడు డామియన్ సైమన్ కొట్టిపారేశాడు. పాకిస్తాన్, భారత్‌లోని ఆడంపూర్ ఎయిర్‌బేస్‌పై దాడులు చేసినట్లు చెప్పుకుంటోంది. ఈ స్థావరంలోని సుఖోయ్ 30 MKI యుద్ధ విమానాన్ని ధ్వంసం చేసినట్లు చెబుతోంది. సైమన్ అసలు నిజాన్ని వెలుగులోకి తేవడంతో ఇప్పుడు పాకిస్తాన్ మళ్లీ సైలెంట్ అయింది. నిజానికి పాక్ పేర్కొంటున్న శాటిలైట్ ఇమేజ్ భారత్-పాక్ సంఘర్షణకు రెండు నెలల ముందు అంటే మార్చి 2025లో తీసింది. మిగ్-29 మెయింటనెన్స్ సమయంలో తీసిన ఫోటోగా తేల్చారు. ఇంజిన్ టెస్ట్ ప్యాడ్ దగ్గర నల్లటి మసి కనిపించడం సాధారణమని చెప్పారు.

Read Also: Asian Suniel : ఏషియన్ సునీల్ సంచలనం..ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడి పదవికి రాజీనామా

పాకిస్తాన్ ఇలాగే గుజరాత్ లోని భుజ్ ఎయిర్‌బేస్ లోని S-400 రాడార్ వ్యవస్థను నాశనం చేసినట్లు మరొక ఫోటోని ప్రసారం చేసింది. అయితే, ఈ చిత్రంలో మిలిటరీ అఫ్రాన్‌పై నల్లటి మరకల్ని చూపిస్తుంది. ఇది వాహన మెయింటనెన్స్ యార్డ్ దగ్గర ఉన్న ఆయిల్ మరకలుగా తేలింది. ఇది కూడా రెండు దేశాల మధ్య ఉద్రిక్తత కన్నా ముందే తీసినట్లు తేలింది. ఇక నలియా ఎయిర్‌బేస్‌పై కూడా తాము దాడి చేసినట్లు పాకిస్తాన్ చెప్పుకుంది. రన్‌వేపై ఉన్న చీకటిని బాంబు దాడిగా పేర్కొంది. నిజానికి అది మేఘం అని విశ్లేషకులు తేల్చారు.

ఆదంపూర్ ఎయిర్‌బేస్ ప్రాముఖ్యత..

పాకిస్తాన్ తో గతంలో జరిగిన ఘర్షణల్లో ఆదంపూర్ ఎయిర్‌బేస్ కీలక పాత్ర పోషించింది. పాక్ సరిహద్దు నుంచి ఇది కేవలం 100 కి.మీ దూరంలో ఉంది. 1965 భారత్-పాక్ యుద్ధంలో పాక్ దీనిని టార్గెట్ చేసింది. ఈ వైమానిక స్థావరంలో సుఖోయ్ -7, మిగ్-21 వంటి కీలకమైన విమానాలు ఉన్నాయి. మొదటి ఎస్ -400 వైమానిక రక్షణ యూనిట్ 2022లో ఆడంపూర్ వైమానిక స్థావరంలో మోహరించబడింది. ప్రస్తుతం, ఇది మిగ్ -29లు మరియు సు -30 ఎంకెఐలతో సహా IAF యొక్క కొన్ని ప్రధాన ఫైటర్ స్క్వాడ్రన్‌లను కలిగి ఉంది.

Exit mobile version