Asian Suniel : ఏషియన్ సునీల్ సంచలనం..ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడి పదవికి రాజీనామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏషియన్ సునీల్‌గా తెలుగు సినీ వర్గాల్లో పాపులారిటీ సంపాదించిన నిర్మాత సునీల్ నారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిజానికి, ఆయన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా వరుసగా మూడవసారి నిన్న ఎన్నికయ్యారు. అయితే, తాజాగా ఈ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఒక లేఖ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా, ఆయన తనకు సంబంధం లేకుండా తన పేరుతో పబ్లిక్ స్టేట్‌మెంట్‌లు ఇస్తున్నారని ఆరోపించారు. సినీ పరిశ్రమ నుంచి ఏదైనా పబ్లిక్ స్టేట్‌మెంట్ కానీ, ఇంటర్వ్యూ కానీ, ప్రెస్ మీట్ కానీ నిర్వహిస్తే, తనకు ఏమాత్రం సమాచారం ఇవ్వడం లేదని వెల్లడించారు.
Also Read:Kannappa : కన్నప్ప.. ఆ నలుగురు ఎక్కడప్పా..?
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
ఈ క్రమంలోనే, ఇకమీదట ఎలాంటి బాధ్యతలు తీసుకోవాలనుకోవడం లేదని, తన ఇన్వాల్వ్‌మెంట్ లేని విషయాల్లో మాటపడాలని అనుకోవడం లేదని చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా కొనసాగలేనని, తనకు అవగాహన లేకుండా, తన ప్రమేయం లేకుండా ఇచ్చే స్టేట్‌మెంట్‌ల వల్ల తన పేరు పోగొట్టుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పుకొచ్చారు. కేవలం ఈ కారణంతోనే తాను అధ్యక్షుడిగా రాజీనామా చేస్తున్నానని ఆయన వెల్లడించారు.
Also Read:Prem Kumar : గుండెల్ని పిండే తమిళ డైరెక్టర్ స్ట్రైట్ తెలుగు సినిమా?
ఫిల్మ్ ఛాంబర్ తాను ఇచ్చిన ఈ లేఖను రాజీనామాగా పరిగణించాలని ఆయన కోరారు. అలాగే, తన తర్వాత మరొకరిని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా నియమించాలని కూడా కోరారు. గత కొద్ది రోజులుగా ఏషియన్ సునీల్ పేరు అనేక విషయాల్లో వార్తల్లోకి ఎక్కుతోంది. ముఖ్యంగా, పవన్ కళ్యాణ్ సినిమాపై కుట్ర చేసిన ఆ నలుగురిలో ఆయన కూడా ఒకరని వాదన ఎక్కువగా వినిపిస్తున్న నేపథ్యంలో, ఇప్పుడు ఈ రాజీనామా లేఖ హాట్ టాపిక్‌గా మారింది.
- Tags
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?