Pakistan: జమ్మూ కాశ్మీర్ ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’లో దాయాది దేశం పాకిస్తాన్ ప్రమేయం స్పష్టంగా తెలుస్తోంది. పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ప్రాక్సీ్ ఉగ్రసంస్థ ‘‘టీఆర్ఎఫ్’’ ఈ దాడికి బాధ్యత ప్రకటించింది. అమాయకులైన 26 మంది టూరిస్టుల్ని ముష్కరులు బలి తీసుకోవడంపై యావత్ దేశం తీవ్రం ఆగ్రహంతో రగిలిపోతోంది. పాకిస్తాన్‌ని నాశనం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారత్ ‘‘సింధు నది జలాల ఒప్పందం’’ రద్దు చేసింది. సరిహద్దుల్లోని అట్టారీ-వాఘా బోర్డర్‌ని క్లోజ్ చేసింది. పాక్ దౌత్యకార్యాలయంలో సిబ్బందిని 55 నుంచి 30కి తగ్గించింది.
ఇదిలా ఉంటే, భారత్ ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు చేయడంపై పాకిస్తాన్ తీవ్రంగా స్పందించింది. భారత్ తీసుకున్న నిర్ణయాన్ని ‘‘జలయుద్ధం’’గా పేర్కొంది. ఈ చర్యలను చట్టవిరుద్ధమైనవిగా పేర్కొంది. భారత తీరును చట్టబద్ధంగా సవాల్ చేస్తామని, ప్రపంచ బ్యాంక్ వంటి ప్రపంచ సంస్థ మధ్యవర్తిత్వంతో జరిగిన ఒప్పందం నుంచి భారత్ ఏకపక్షంగా నిష్క్రమించలేదని పాకిస్తాన్ తెలిపింది.
Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీకి హిండెన్‌బర్గ్‌తో సంబంధం.. “మొసాద్” ఆపరేషన్‌పై సంచలన నివేదిక..
‘‘సింధూ జలాల ఒప్పందాన్ని భారతదేశం నిర్లక్ష్యంగా నిలిపివేయడం జలయుద్ధ చర్య; పిరికితనం, చట్టవిరుద్ధమైన చర్య. ప్రతి చుక్క మాదే. మేము దానిని పూర్తి శక్తితో చట్టబద్ధంగా, రాజకీయంగా, ప్రపంచవ్యాప్తంగా అడ్డుకుంటాం. ’’ అని పాకిస్తాన్ ఇంధన మంత్రి అవాయిస్ లెఘారి ట్వీట్ చేశారు.
1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహించిన ఒప్పందం ప్రకారం, సింధు వ్యవస్థ నుండి 80% నీటిని భారతదేశం, దిగువన ఉన్న పాకిస్తాన్ వినియోగించుకుంటోంది. అయితే, పలు సందర్భాల్లో పాకిస్తాన్ భారత్‌పై యుద్ధం చేసినా, సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నప్పటికీ భారత్ ఈ ఒప్పందం జోలికి వెళ్లలేదు. గతంలో పుల్వామా దాడి జరిగిన సందర్భంలో భారత ప్రధాని మోడీ మాట్లాడుతూ ‘‘ రక్తం నీరు కలిసి ప్రవహించలేవు’’ అని ఈ ఒప్పందం గురించి స్పష్టం చేశారు. తాజాగా, పహల్గామ్ దాడి తర్వాత భారత్ పూర్తిస్థాయిలో ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.
