Site icon NTV Telugu

Mahua Moitra: “సీబీఐని నా ఇంటికి పంపించి వేధించాలని అనుకుంటున్నారు”.. “క్యాష్ ఫర్ క్వేరీ” కేసులో హాట్ హాట్‌గా పార్లమెంట్..

Mahua Moitra

Mahua Moitra

Mahua Moitra: పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నట్లు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)ఎంపీ మహువా మోయిత్రా అభియోగాలను ఎదుర్కొంటున్నారు. క్యాష్ ఫర్ క్వేరీగా చెప్పబడుతున్న ఈ కేసులో ఇప్పటికే పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ మోయిత్రాను విచారించింది. తాజాగా ఈ రోజు ఎథిక్స్ కమిటీ నివేదికను పార్లమెంట్ ముందుకు తీసుకువచ్చింది. ప్యానెట్ మొదటి నివేదికను ఎథిక్స్ కమిటీ చైర్మన్ వినోద్ కుమార్ సోంకర్ సమర్పించారు.

మహువా మోయిత్రా తీవ్రమైన దుష్ర్పవర్తనకు కఠినంగా శిక్షించబడాలని, అందువల్ల ఆమెను పదిహేడవ లోక్ సభ సభ్యత్వం నుంచి బహిష్కరించాలని కమిటీ సిఫారసు చేసింది. ఆమె అత్యంత అభ్యంతరకమైన, అనైతిక హేయమైన, నేరపూరిత ప్రవర్తన దృష్టిలో ఉంచుకుని టైమ్ లిమిట్‌తో భారత ప్రభుత్వం చట్టపరమైన సంస్థాగత విచారణ చేయాలని సిఫారసు చేసింది.

Read Also: Supreme Court: ‘‘రెండు నిమిషాల లైంగిక సుఖం కోసం’’.. హైకోర్టు వ్యాఖ్యలపై సుప్రీం ఆగ్రహం..

ఎథిక్స్ కమిటీ రిపోర్టును ప్రవేశపెట్టిన వెంటనే టీఎంసీ, కాంగ్రెస్‌కి చెందిన కొందరు రిపోర్టు కాపీని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. కమిటీ సిఫారసులపై ఓటింగ్‌కి వచ్చే ముందు చర్చ చేపట్టాలని టీఎంసీ సభ్యులు డిమాండ్ చేశారు. మహువాను లోక్ సభ నుంచి బహిష్కరించేలా చేస్తున్నారంటూ మండిపడ్డారు. పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీలోని మంది సభ్యుల్లో 6గురు నివేదికకు అనుకూలంగా ఓటేశారు. నలుగురు విపక్ష సభ్యులు మహువాకు మద్దతుగా నిలిచారు.

ఇదిలా ఉంటే మహువా మోయిత్రాకు ఎథిక్స్ కమిటీ నివేదికపై చర్చ సందర్భంగా మాట్లాడేందుకు అనుమతి నిరాకరించారు. మరోవైపు ఆమె పార్లమెంట్ వెలుపల మాట్లాడుతూ.. ఎథిక్స్ కమిటీ అన్ని నిబంధలను ఉల్లంఘించిందని ఆరోపించారు. సీబీఐని నా ఇంటికి పంపి, వేధింపులకు గురి చేయాలని అనుకుంటున్నారని అన్నారు.

లోక్‌సభలో ప్రధాని నరేంద్రమోడీ, వ్యాపారవేత్త అధానీలే టార్గెట్‌గా ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి మహువామోయిత్రా గిఫ్టులు, లంచం తీసుకుందని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించారు. అంతే కాకుండా ఆమె వ్యక్తిగత పార్లమెంట్ లాగిన్ వివరాలను ఇతరులతో పంచుకున్నారని ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ ప్రారంభించిన కమిటీ హోం, ఐటీ శాఖల నుంచి నివేదికలను తెప్పించుకుని మహువామోయిత్రాను విచారించింది. మరోవైపు దర్శన్ హీరానందానీ ఎథిక్స్ కమిటీకి అఫిడవిట్ సమర్పించారు. ఇందులో తాను మహువామోయిత్రాకు గిఫ్టులు ఇచ్చినట్లు పేర్కొన్నారు.

Exit mobile version