NTV Telugu Site icon

ఇదెక్కడి మాస్ ‘రివెంజ్’ రా మావా.. 250 కుక్కలను చంపిన కోతులు

monkeys

సాధారణంగా సినిమాల్లో హీరో ఫ్యామిలీ ని విలన్స్ చంపేస్తే.. హీరో విలన్స్ ని చంపి రివెంజ్ తీర్చుకొంటాడు.. అందరికి తెలిసిందే.. కానీ ఎప్పుడైనా జంతువులు కూడా రివెంజ్ తీర్చుకున్న ఘటనలు చూసారా..? కనీసం విన్నారా..? అయితే మహారాష్ట్రలో జరిగిన ఈ షాకింగ్ ఘటన గురించి తెలుసుకోవాల్సిందే. ప్రస్తుతం ఈ ఘటన సోసివల్ మీడియాలో సంచలనంగా మారింది.

వివరాలలోకి వెళితే.. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలోని మజల్‌గావ్‌లో గత నెలరోజులుగా కోతులు విశ్వ రూపం చూపిస్తున్నాయి. కుక్క కనిపించడం ఆలస్యం నోటికి కరుచుకొని చెట్లపైకి, ఇంటిపైకి తీసుకెళ్లి కిందపడేసి చంపుతున్నాయి.. కుక్కలను వెంటాడి మరి కోతులు చంపుతున్నాయి. ఇప్పటివరకు 250 కుక్కలను కోతులు చంపాయి. అయితే ఈ కుక్కల వేట కోతులు ఎందుకు మొదలుపెట్టాయి అని అంటే రివెంజ్ అంటున్నారు స్థానికులు.. ఏంటీ కోతులకు కూడా పగ ఉంటుందా..? అని నోరెళ్లబెడుతున్నా.. అది నిజమేనాని స్థానికులు తెలుపుతున్నారు.

నెల రోజుల క్రితం ఒక కోతి పిల్లను నాలుగు కుక్కలు కలిసి చంపేశాయి అంట.. తమ కోతిపిల్లను చంపడం కళ్లారా చూసిన మిగతా కోతులు వాటిపై పగ పట్టాయి. అప్పటినుంచి ఆ ఏరియాలో కుక్క కనిపించడం ఆలస్యం.. వాటిపై దాడి చేసి ఎత్తుకుపోయి చెట్లమీద నుంచి విసిరేసి చంపుతన్నాయి. ఇక మొన్నటికి మొన్న కోతులను పట్టుకోవడానికి అధికారులు రెక్కీ నిర్వహించగా ఒక్క కోతి కూడా బయటపడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఇక మీమర్స్ ఈ వార్తతో మీమ్స్ వేస్తూ నవ్వులు పూయిస్తున్నారు. ఇదెక్కడి మాస్ రివెంజ్ రా మావా అంటూ మీమ్స్ చేస్తున్నారు. మరి ఈ కుక్కల వేటను కోతులు ఎప్పుడు ఆపుతాయో చూడాలి.