Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Enforcement Directorate Summoned Sonia Gandhi Rahul Gandhi

BREAKING: నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ కు ఈడీ సమన్లు

Published Date :June 1, 2022 , 3:06 pm
By Venu Goapl Reddy
BREAKING: నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ కు ఈడీ సమన్లు
  • Follow Us :
  • google news
  • dailyhunt

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు జారీ చేసింది. ఈ విషయాన్ని పార్టీ అధికార ప్రతినిధి రణ్ దీప్ సుర్జేవాలా తెలిపారు. సోనియా గాంధీని ఈనెల 8న హాజరు కావాలని కోరగా.. రాహుల్ గాంధీని అంతకన్నా ముందే జూన్ 5న హాజరు కావాల్సిందిగా కోరినట్లు తెలిసింది. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఇద్దరికి ఈడీ సమన్లు జారీ చేసింది. సోనియా గాంధీ ఈడీ సమన్లకు కట్టుబడి ఉన్నారని ఆ పార్టీ కీలక నేత అభిషేక్ మను సింగ్వీ తెలిపారు. అయితే రాహుల్ గాంధీ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నందు వల్ల కొత్త తేదీని కోరే అవకాశం ఉందని ఆయన అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ప్రమోట్ చేసిన యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలోని నేషనల్ హెరాల్డ్ పేపర్ లో ఆర్థిక అవకతవకలు జరిగాయని అభియోగాలు ఉన్నాయి. ఈ కేసు కింద సోనియా, రాహుల్ గాంధీ స్టేట్మెంట్లను రికార్డ్ చేయనున్నారు ఈడీ అధికారులు. ఈ కేసుకు సంబంధించి ఈడీ ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే, పవన్ బన్సల్ ప్రశ్నించింది. ఈడీ కాంగ్రెస్ నేతల్ని ప్రశ్నించడంపై ఆ సమయంలో లోక్ సభలో కాంగ్రెస్ విప్ మానిక్కం ఠాగూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార బీజేపీ వేధింపులకు గురి చేస్తుందని మండిపడ్డారు.2013లో సుబ్రమణ్య స్వామి వేసిన పిటిషన్ ఆధారంగా నేషనల్ హెరాల్డ్ కేసు కొనసాగుతోంది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్ దీప్ సుర్జేవాలా బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఒకప్పుడు నేషనల్ హెరాల్డ్ ను తొక్కేయడానికి బ్రిటిష్ వారు ప్రయత్నించారని.. ప్రస్తుతం బీజేపీ ఆ పని చేస్తుందని విమర్శించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Abhishek Manu Singhvi
  • ED
  • National Herald case
  • rahul gandhi
  • Sonia Gandi

తాజావార్తలు

  • CSK vs PBKS: ఆయుష్ మాత్రే విధ్వంసం.. పంజాబ్ ముందు భారీ టార్గెట్

  • Most Expensive Mango: అత్యంత ఖరీదైన మామిడి.. ఒకే కేజీతో స్పోర్ట్స్ బైకే కొనవచ్చు.. ఇంతకీ దీని ప్రత్యేకత ఏమిటి..?

  • US-Iran War: అమెరికన్ పైలట్ విషయంలో ఉత్కంఠ.. పట్టిస్తే భారీ ఫ్రైజ్ మనీ ఇస్తామని ఇరాన్ ప్రకటన..

  • Mangoes: మామిడి తింటున్నారా.. హైదరాబాద్ లో విష మామిడి పళ్ళ తయారీ.. పైన నిగనిగ.. లోపల కాలకూట విషం..

  • Story Board: ఎన్నికల సమయంలో ఉచితాలు బాధ్యతారాహిత్యం..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions