NTV Telugu Site icon

End India bloc: కలిసి ఉండనప్పుడు కూటమి ఎందుకు?.. ఇండియా బ్లాక్పై ఒమర్‌ అబ్దుల్లా ఫైర్

Omar Abdulla

Omar Abdulla

End India bloc: ఇండియా కూటమిని ఉద్దేశిస్తూ జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమిలో భాగమైన కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ పార్టీల మధ్య విభేదాలు తలెత్తడంతో ఆగ్రహాం వ్యక్తం చేశారు. దీంతో ప్రతిపక్షాల మధ్య ఐక్యతను ఆయన ప్రశ్నించారు. కలసికట్టుగా ఉండకపోతే కూటమికి ముగింపు పలకాలన్నారు. అయితే, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమికి సంబంధించి ప్రస్తుతం ఎలాంటి సమావేశం జరగకపోవడం బాధాకరం అన్నారు. ఇప్పుడు ఈ కూటమికి ఎవరు అధ్యక్షత వహిస్తారు?.. దీని అజెండా ఏంటి?.. అసలు కూటమి ఎలా ముందుకు కొనసాగుతుందని ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు.

Read Also: Relationship Tips : ఈ లక్షణాలు ఉన్న వారిని నమ్మకండి

ఇక, 2024 ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజార్టీ రాకుండా చేసేందుకు శక్తికి మించి కృషి చేసిన ఇండియా కూటమి భవిష్యత్తుపై ఇప్పుడు స్పష్టత లేకుండాపోయిందన్నారు. మనమంతా ఐక్యంగా ఉంటామా, లేదా అనే విషయంపై స్పష్టత లేదని అసహనం వ్యక్తం చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూటమిలోని భాగస్వామ్య పార్టీలు సమావేశానికి సిద్ధంగా ఉండండి.. లేదంటే, లోక్‌సభ ఎన్నికల కోసమే కూటమి ఏర్పడితే.. పొత్తుకు స్వస్తి చెప్పి.. ఇండియా కూటమిని మూసేయండి అని సూచించారు. అలాకాకుండా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయం సాధించాలంటే అందరం కలసికట్టుగా ముందుకు సాగాలని ఒమర్ అబ్దుల్లా పిలుపునిచ్చారు.

Read Also: CM Chandrababu: ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు.. అధికారులపై ఫైర్..

అయితే, త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇండియా కూటమిలో భాగమైన కాంగ్రెస్‌, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య పొత్తుకు దూరంగా ఒంటరిగా బరిలోకి దిగాయి. ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం సైతం కొనసాగుతుంది. దీంతో లోక్‌సభ ఎన్నికల తర్వాత ఇండియా బ్లాక్ కి ప్రాధాన్యత తగ్గిపోయిందని కూటమిలోని నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పందించిన జమ్ముకాశ్మీర్ సీఎం ఒమర్‌ అబ్దుల్లా.. కలిసి ఉండలేకపోతే కూటమిని మూసేస్తే మంచిదని కీలక వ్యాఖ్యలు చేశారు.

Show comments