Site icon NTV Telugu

JK Encounter: జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. పలువురు ఉగ్రవాదులు హతం!

Jk Encounter

Jk Encounter

దేశంలో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత కొనసాగుతున్న ఆపరేషన్‌లో ఇప్పటి వరకు అనేక మంది ముష్కరులను సైన్యం మట్టుబెట్టింది. తాజాగా జమ్మూకాశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పలువురు ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీలో మళ్లీ పాఠశాలలకు బాంబ్ బెదిరింపులు.. మిడ్-టర్మ్ పరీక్షలు రద్దు

ఉధంపూర్, కిష్త్వార్‌లో భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఏడుగురు ఉగ్రవాదులు సైన్యానికి చిక్కినట్లు సమాచారం. ఈ ఘటనలో ఒక జవానుకు కూడా గాయాలు అయినట్లు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో పక్కా సమాచారంతో సైన్యం రంగంలోకి దిగడంతో సైన్యం-ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. అయితే ఎంత మంది ఉగ్రవాదులు చనిపోయారో సైన్యం ఇంకా ప్రకటించలేదు. ఉధంపూర్‌లో చిక్కిన ఉగ్రవాదులు జైషే ఏ మహమ్మద్‌కు చెందినవారిగా అనుమానిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Tejashwi Yadav: ఆ పరిస్థితి వస్తే ఎన్నికల్లో పోటీ చేయను.. తేజస్వి యాదవ్ హెచ్చరిక

Exit mobile version