NTV Telugu Site icon

Encounter: జమ్మూ కాశ్మీర్ దోడా జిల్లాలో ఎన్‌కౌంటర్.. కథువా ఉగ్రదాడి తర్వాత ఘటన..

Encounter

Encounter

Encounter: జమ్మూ కాశ్మీర్ వరస ఉగ్ర ఘటనలతో అట్టుడికిపోతోంది. తాజాగా దోడా జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. నిన్న కథువాలో ఉగ్రవాదులు ఆర్మీ వాహనాలపై మెరుపుదాడి చేసి ఐదుగురు జవాన్ల మరణాలకు కారణమయ్యారు. ఈ ఘటన జరిగిన ఒక రోజు తర్వాత జమ్మూ లోని దోడా జిల్లాలో తాజా ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది.

Read Also: BJP: “బెంగాల్‌లో మరో తాలిబాన్ వీడియో”.. తృణమూల్ అరాచకాలపై రాహుల్ గాంధీ మౌనం ఎందుకు..?

కథువా ఘటన 48 గంటల్లో ఆర్మీపై జరిగిన రెండో దాడి. అంతకుముందు రాజౌరీలోని సైనిక శిబిరంపై ఆదివారం ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడిని సైన్యం తిప్పికొట్టింది. దీంట్లో ఒక సైనికుడు గాయపడ్డాడు. ఆ తర్వాతి రోజు సోమవారం కథువాలో పెట్రోలింగ్ పార్టీపై, ఉగ్రవాదులు అడవుల్లో నక్కి గ్రెనెడ్స్ విసిరి, కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. కథువా ఘటన జరిగిన తర్వాత భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. ఈ ఘటనకు పాక్ ఉగ్రసంస్థ జైషే మహ్మద్‌కి సన్నిహితంగా ఉన్న కాశ్మీర్ టైగర్స్ బాధ్యత ప్రకటించుకుంది.

60 మందికి పైగా పాక్ ఉగ్రవాదులు, జింగిల్ వార్‌ఫేర్‌లో శిక్షణ పొంది జమ్మూ కాశ్మీర్‌లో పనిచేస్తున్నారు. గత నెల కాలం నుంచి రాజౌరీ, కథువా, దోడా జిల్లాల్లో ఉగ్రవాద దాడులు జరిగాయి. గత నెలలో ప్రధాని మోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేస్తున్న రోజే, కథువా జిల్లాలో శివ్ ఖోరీ నుంచి కత్రా వెళ్తున్న యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు దాడి చేయడంతో 10 మంది మరణించారు. జమ్మూ ప్రాంతంలోని కథువా, రాజౌరీ, దోడా జిల్లాల్లోని దట్టమైన అడవులు, కొండలు, లోయలు ఉగ్రవాదులకు అనుకూలంగా ఉన్నాయి. ఈ అడవులు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి కొనసాగుతుండటంతో ఉగ్రవాదులకు అడ్డాగా మారింది.