Emmanuel Macron To Visit India Early Next Year: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుమేల్ మక్రాన్ భారత పర్యటనకు రాబోతున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఆయన భారతదేశాన్ని సందర్శించేందుకు రానున్నారు. ఫ్రెంచ్ మంత్రి క్రిసౌలా జచరోపౌలౌ, భారత సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ తో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. మాక్రాన్ 2023 ప్రారంభంలో భారతదేశాన్ని సందర్శించాల్సి ఉందని అన్నారు. మహారాష్ట్రలోని జైతాపూర్ అణువిద్యుత్ రియాక్టర్ల నిర్మాణానికి సంబంధించి పునరుద్ధరణ జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఇండియాకు రానున్నట్లు తెలుస్తోంది.
Read Also: Partial Solar Eclipse: ఈ నెల 25న పాక్షిక సూర్యగ్రహణం.. ఇప్పుడు తప్పితే మళ్లీ పదేళ్ల తరువాతే
జైతాపూర్ ప్రాజెక్టుకు సంబంధించి సాంకేతిక, ఆర్థిక, పౌర అణు బాధ్యత సమస్యలను ఇరు పక్షాలు వీలైనంత త్వరగా.. మక్రాన్ పర్యటనకు ముందే పరిష్కరించుకుంటామని జితేంద్ర సింగ్ అన్నారు. మహారాష్ట్ర రత్నగిరి జిల్లా జైతాపూర్ ఒక్కొక్కటిగా 1,650 మెగావాట్ల ఆరు అణువిద్యుత్ ఫ్లాంట్లను నిర్మించనున్నట్లు భారత్ ప్రకటించింది. మొత్తం 9,900 మెగావాట్ల సామర్థ్యంతో దేశంలోనే అతిపెద్ద అణువిద్యుత్ కేంద్రంగా జైతాపూర్ అణువిద్యుత్ కేంద్ర మారనుంది.
అణువిద్యుత్ రియాక్టర్ల ఏర్పాటును వేగవంతం చేసేందుకు జితేంద్ర సింగ్, ఫ్రెంచ్ మంత్రి జచరోపౌలౌ చర్చించారు. ఫ్రెంచ్ కంపెనీ ఈడీఎఫ్ గత ఏడాది న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్పీసీఐఎల్)కి మధ్య ఒప్పందం కుదిరింది. ఆరు యూరోపియన్ ప్రెషరైజ్డ్ రియాకర్లు నిర్మించడానికి ఒప్పందం కుదిరింది. ఈ ఏడాది మేలో ఈడీఎఫ్ ఉన్నతస్థాయి బృందం భారతదేశాన్ని సందర్శించారు. ఎన్పీసీఐఎల్ అధికారులతో చర్చలు జరిపారు. దేశంలో కర్భన ఉద్గారాలను తగ్గించేందుకు ప్రభుత్వం సోలార్, అణువిద్యుత్ కేంద్రాలను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగానే జైతాపూర్ అణు విద్యుత్ కేంద్రం రెడీ అవుతోంది.
