NDMA: నేడు మీ ఫోన్ తో పాటు లక్షలాది మొబైల్ ఫోన్లలో ఒకేసారి సైరన్.. ఎందుకో తెలుసా?
- నేడు లక్షలాది మొబైల్ ఫోన్లలో ఒకేసారి సైరన్
- టెలికమ్యూనికేషన్స్ శాఖ (DoT), జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ సంయుక్తంగా ఈ పరీక్ష
- ప్రమాదాల సమయంలో ప్రజలకు వెంటనే సమాచారం అందించడమే ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా నేడు (మే 2) లక్షలాది మొబైల్ ఫోన్లలో ఒకేసారి పెద్ద సైరన్ శబ్దం వినిపించవచ్చు. అయితే దీనిపై ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త మొబైల్ ఆధారిత విపత్తు హెచ్చరిక వ్యవస్థను పరీక్షించేందుకు ఈ డ్రిల్ నిర్వహిస్తున్నారు. టెలికమ్యూనికేషన్స్ శాఖ (DoT), జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA) సంయుక్తంగా ఈ పరీక్షను చేపడుతున్నాయి. అత్యవసర పరిస్థితులు, ప్రకృతి విపత్తులు లేదా ఇతర ప్రమాదాల సమయంలో ప్రజలకు వెంటనే సమాచారం అందించడమే ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యం.
ప్రభుత్వం అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థకు సాచెట్ (SACHET – National Disaster Alert Portal) అని పేరు పెట్టారు. ఇప్పటికే ఢిల్లీ-ఎన్సీఆర్తో పాటు పలు మెట్రో నగరాల్లో దీన్ని విజయవంతంగా పరీక్షించారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ వ్యవస్థ పనితీరును మరోసారి పరీక్షించనున్నారు. NDMA పంపిన సందేశం ప్రకారం, మే 2, 2026న మీ ప్రాంతంలో ‘ఎమర్జెన్సీ బ్రాడ్కాస్ట్ అలర్ట్’ పరీక్ష నిర్వహించబడుతుంది. మీ మొబైల్‌కు హెచ్చరిక సందేశం లేదా సైరన్ వచ్చినా ఎలాంటి చర్య తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది కేవలం టెస్ట్ మాత్రమే.
Also Read
వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?
ఈ అత్యవసర హెచ్చరిక వ్యవస్థ Common Alerting Protocol (CAP) ఆధారంగా పనిచేస్తుంది. అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU) సిఫార్సు చేసిన ఈ టెక్నాలజీ ప్రస్తుతం దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమల్లో ఉంది.
ఈ వ్యవస్థ ద్వారా
వినియోగదారుల మొబైల్ ఫోన్లకు SMS అలర్ట్ పంపిస్తారు
అదనంగా పెద్ద సైరన్ శబ్దం వినిపిస్తుంది
సెల్ బ్రాడ్కాస్ట్ టెక్నాలజీ ద్వారా ఒకేసారి వేలాది ఫోన్లకు అలర్ట్ చేరుతుంది
ప్రత్యేకంగా, విపత్తు సంభవించే ప్రాంతంలో ఉన్న వినియోగదారులకు మాత్రమే హెచ్చరికలు చేరేలా ఈ వ్యవస్థ రూపొందించారు.
ఎందుకు ఈ పరీక్ష?
భవిష్యత్తులో వరదలు, భూకంపాలు, తుఫానులు లేదా ఇతర అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. దీనివల్ల ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. అందుకే మే 2న మీ మొబైల్లో సైరన్ మోగినా, అలర్ట్ మెసేజ్ వచ్చినా భయపడకుండా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Trump: ఇరాన్‌తో చర్చలు బాగున్నాయి.. ఖతార్ భేటీపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Ramayan Leak: రణబీర్ కపూర్ ‘రామాయణం’ లీక్? ఆ 11 సెకన్ల క్లిప్ చూసి తలబాదుకుంటున్న ఫ్యాన్స్!
-
Adani Ports: రూ.13,225 కోట్ల మెగా డీల్.. అదానీ షేర్ కొనేందుకు ఎగబడుతున్న ఇన్వెస్టర్లు! ఆ షేర్ ఏదో తెలుసా?
-
Iran: ఖమేనీ అంత్యక్రియలకు ప్రతిపక్ష కాంగ్రెస్‌కు ఆహ్వానం.. ఎవరు వెళ్లనున్నారంటే..!
ట్రెండింగ్
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్‌తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్‌ను ఈజీగా బుట్టలో వేస్తాం!