Site icon NTV Telugu

Elon Musk: మోడీతో మాట్లాడటం గొప్ప గౌరవం.. ఈ ఏడాది భారత్‌కి వస్తా..

Elon Musk

Elon Musk

Elon Musk: ప్రధాని నరేంద్రమోడీతో బిలయనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మాట్లాడారు. ఈ ఏడాది భారత్‌లోకి టెస్లా ఎంట్రీ ఇస్తున్న తరుణంలో ఇరువురు మాట్లాడుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని మోడీతో మాట్లాడిన ఒక రోజు తర్వాత ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది చివర్లో తాను ఇండియాకు వస్తానని, ఈ పర్యటనపై ఎంతో ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీతో మాట్లాడటాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు.

Read Also: Earthquake: ఆప్ఘనిస్తాన్, పాకిస్థాన్, ఢిల్లీలో భూప్రకంపనలు

సుంకాలపై భారత్, అమెరికా చర్చలు జరుపుతున్న సమయంలో మస్క్‌తో ప్రధాని మోడీ మాట్లాడారు. ప్రస్తుతం ఇరు దేశాలు కూడా వాణిజ్య ఒప్పందాన్ని కుదర్చుకునే దిశలో ఉన్నాయి. అంతకుముందు, ప్రధాని మోడీ ఎక్స్‌లో తాను టెక్ బిలియనీర్ మస్క్‌తో మాట్లాడానని, సాంకేతికత, ఆవిష్కరణల సహాకారంలో అపారమైన సామర్థ్యాలపై చర్చించామని చెప్పారు. మరోవైపు, ఏప్రిల్ 21-24లో అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వన్స్ పర్యటన కూడా ఉండబోతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ ఎలాన్ మస్క్‌తో భేటీ అయ్యారు.

మరికొన్ని నెలల్లో టెస్లా భారత మార్కెట్‌లోకి ప్రవేశించబోతోంది. ముంబైకి వేల సంఖ్యలో కార్లను దిగుమతి చేయనున్నారు. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో ముంబై, ఢిల్లీ, బెంగళూర్లలో అమ్మకాలు ప్రారంభించాలని టెస్లా యోచిస్తోంది.

Exit mobile version