NTV Telugu Site icon

Mallikarjun Kharge: సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జమ్ములో ఎన్నికలు నిర్వహించాలి..

Mallikarjuna Kharge

Mallikarjuna Kharge

Mallikarjun Kharge: కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువు ప్రకారం జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రంలో ఎన్నికలు జరపాలని డిమాండ్‌ చేశారు. తద్వారా అక్కడి ప్రజలు తమ నాయకులను ఎన్నుకుంటారని చెప్పుకొచ్చారు. జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు చేసి.. ఐదేళ్లు పూర్తైన సందర్భంగా మల్లికార్జున ఖర్గే ఈ కామెంట్స్ చేశారు.

Read Also: Unbelievable Catch: ఇలా కూడా పడతారా.. క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని క్యాచ్!

కాగా, ఆర్టికల్‌ 370 రద్దుతో జమ్ము కశ్మీర్ ఆర్థికాభివృద్ధి మెరుగుపడుతుండటంతో పాటు తీవ్రవాదాన్ని అరికట్టే ఛాన్స్ ఉంటుందని గతంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు.. కానీ, ప్రస్తుతం ఆయన మాటలకు భిన్నంగా జమ్ములో ఉగ్రదాడులు రోజురోజుకూ భారీగా పెరిగిపోతున్నాయని మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. 2019 నుంచి ఇప్పటి వరకు దాదాపు 683 ఉగ్రదాడులు జరిగాయని.. 258 మంది జవాన్లు, 170 మంది పౌరులు ప్రాణాలు విడిచారని ఖర్గే తెలిపారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ మూడో సారి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి జమ్ములో 25 ఉగ్రదాడులు జరిగ్గా.. 15 మందికి పైగా సైనికులు ప్రాణాలు కోల్పోయి.. 27 మంది గాయపడ్డారని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.