Site icon NTV Telugu

Election Commission of India: ఆ పార్టీలపై ఎన్నికల సంఘం నిషేధం.. కారణం ఇదే..

Election Commission Of India

Election Commission Of India

Election Commission of India: ఎలాంటి కార్యకలాపాలు లేకుండా నిష్క్రియాపరంగా ఉన్న రాజకీయ పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ చర్యలకు ఉపక్రమించింది. మొత్తం 7 రాష్ట్రాల్లో 253 రాజకీయా పార్టీలు నిష్క్రియాపరంగా ఉన్నాయని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. వీటిలో 86 పార్టీల ఉనికి, మనుగడే లేదని ఓ ప్రకటనలో తెలిపింది. 253 రాజకీయ పార్టీలలో 66 పార్టీలు ఒకే ఎన్నికల గుర్తు కావాలని కోరి.. ఏ ఎన్నికల్లోనూ ఒక్క అభ్యర్థిని కూడా పోటీలో నిలపలేదని ఈసీ వెల్లడించింది.

తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్, ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పార్టీలపై నిషేధం విధించింది. ఆయా రాష్ట్రాల్లోని ఎన్నికల అధికారులు ఇచ్చిన సమాచారం మేరక కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. 1968 లో జారీ చేసిన “ఎన్నికల గుర్తు” ఆర్డర్ వల్ల పొందే ప్రయోజనాలు పొందకుండా
ఈ పార్టీలను నిషేధించిన కేంద్ర ఎన్నికల సంఘం. ఇప్పటి వరకు కేంద్ర ఎన్నికల సంఘం వద్ద నమోదై గుర్తింపు పొందని మొత్తం 537 రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోనుంది ఈసీ.

READ ALSO: Asaduddin Owaisi: కావాలనే బీజేపీ ముస్లింలను టార్గెట్ చేస్తోంది.

ఈ ఏడాది మే నెల 25 నుంచి తప్పనిసరిగా, నియమనిబంధనలకు అనుగుణంగా ఇవ్వాల్సిన సమాచారం ఇవ్వలేదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2015 నుంచి 16 అంశాలకు సంబంధించిన సమాచారం ఈ రాజకీయ పార్టీ లు సమకూర్చలేదని “కేంద్ర ఎన్నికల సంఘం” ప్రకటించింది. 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం సెక్షన్ 29ఏ కింద రాజకీయ పార్టీ ప్రధాన కార్యాలయం, చిరునామా, కార్యనిర్వాహక వర్గం, మారిన చిరునామా వంటి సమాచారాన్ని ఈ రాజకీయ పార్టీలు సమర్పించలేదని ఈసీ తెలిపింది.

సంబంధిత రాజకీయ పార్టీలన్నీ 30 రోజులలో ప్రతి ఏడాది కి సంబంధించిన సమాచారం మొత్తాన్ని అందజేయాలని అధికారికంగా విడుదల చేసిన ప్రకటన లో పేర్కొంది కేంద్ర ఎన్నికల సంఘం. రాజకీయా పార్టీ పేరును నమోదు చేసుకున్న తర్వాత, 5 ఏళ్లలోపు కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించే ఎన్నికల్లో పోటీ చేయాలి. ఆరేళ్ళల్లోపు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయని రాజకీయ పార్టీ పేరును “నమోదైన రాజకీయ పార్టీల జాబితా” నుంచి తొలగించడమౌతుందని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.

Exit mobile version