Election Commission: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఎన్సీపీ శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే శివసేనల ‘‘మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)’’ ఘోర పరాజయం పాలైంది. రాష్ట్రంలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 49 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. కాంగ్రెస్ 100కి పైబడి సీట్లలో పోటీ చేస్తే కేవలం 16 చోట్ల విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్లు కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
Read Also: Honda Amaze Facelift: న్యూ డిజైన్‌తో లాంచ్ అవుతున్న హోండా అమేజ్.. ఫీచర్లు, వివరాలివే..!
కాంగ్రెస్ పార్టీ అనుమానాలను, ఆందోళనల్ని పరిష్కరించడానికి ఎన్నికల సంఘం డిసెంబర్ 3న ఆ పార్టీ ప్రతినిధి బృందాన్ని ఆహ్వానించింది. ఓటర్ ఓటింగ్ డేటాకు సంబంధించిన సమస్యపై స్పందించిన ఈసీ, ఇందులో ఎలాంటి వ్యత్యాసం లేదని, పోలింగ్ స్టేషన్ల వారీగా అభ్యర్థలందరికీ డేటా అందుబాటులో ఉందని చెప్పింది.సాయంత్రం 5 గంటల పోలింగ్ డేటా, ఫైనల్ ఓటింగ్ డేటా మధ్య గ్యాప్ అనేది ప్రిసీడింగ్ అధికారులు ఇతర విధుల నిర్వర్తించడంలో నిమగ్నమై ఉండటం వల్ల జరిగిందని చెప్పింది. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో సుమారు రాత్రి 11.45 గంటలకు ఎన్నికల సంఘం ప్రెస్ నోట్ విడుదల చేసింది, ఆ తర్వాత జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే సమయాన్ని అనుసరించినట్లు ఈసీ తెలిపింది.
మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ మరియు కౌంటింగ్ ప్రక్రియలకు సంబంధించిన డేటాలో కాంగ్రెస్ అనుమానాలను వ్యక్తం చేసింది. తీవ్రమైన అసమానలు ఉన్నాయని ఆరోపించింది. దీనిపై శుక్రవారం ఎన్నికల కమిషన్ ముందు అనుమానాలను లేవనెత్తింది. సంబంధిత సాక్ష్యాలు సమర్పించడానికి వ్యక్తిగత విచారణనున కోరింది. మరోవైపు మహారాష్ట్ర ఎన్నికల్లో ఈవీఎంలలో అవకతవకలు ఏర్పడ్డాయని కాంగ్రెస్ ఆరోపిస్తూ.. పేపర్ బ్యాలెట్‌ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేసింది. శుక్రవారం కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశంలో కూడా రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు ఇదే వాదనల్ని పునరావృతం చేశారు. ఎన్నికల సంఘం కాంగ్రెస్ ఆరోపణల్ని తిరస్కరించింది. ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (VVPAT)తో సహా పలు లేయర్‌ల వెరిఫికేషన్ మరియు ట్యాంపర్ ప్రూఫ్ మెకానిజమ్స్‌తో EVMలు సురక్షితంగా ఉన్నాయని పోల్ బాడీ తెలిపింది.