Site icon NTV Telugu

Bypolls 2025: ఆ నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలు..

Ec

Ec

Bypolls 2025: దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. తాజాగా, గుజరాత్, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ నియోజక వర్గాలకు నిర్వహించబోయే ఉప ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. జూన్ 19వ తేదీన ఆయా నియోజక వర్గాల్లో పోలింగ్ జరగనుంది. జూన్ 23వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టానున్నారు.

Read Also: Cuts Off Private Part: భర్త ప్రైవేట్ పార్ట్ కోసిన భార్య… ఆపై యాసిడ్ తాగి ఆత్మహత్యయత్నం..!

అయితే, గుజరాత్‌లోని రెండు అసెంబ్లీ స్థానాలకు బై ఎలక్షన్స్ జరగనుండగా, కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్‌లలోని ఒక్కొక్క అసెంబ్లీలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇక, గుజరాత్‌లో, సిట్టింగ్ ఎమ్మెల్యే కర్సన్‌ భాయ్ పంజాభాయ్ సోలంకి మరణించడంతో కాడి స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం అయింది. అలాగే, సిట్టింగ్ ఎమ్మెల్యే భయానీ భూపేంద్ర భాయ్ గండుభాయ్ రాజీనామాతో రాష్ట్రంలోని విశావదర్ స్థానానికి మరోసారి ఎన్నిక జరగబోతుంది.

Read Also: Adah Sharma : బాలీవుడ్ నెపోటిజంపై.. అదా శర్మ కామెంట్స్ వైరల్

ఇక, కేరళలోని పీవి అన్వర్ రాజీనామాతో నీలంబర్ అసెంబ్లీ స్థానానికి బైపోల్ జరగనుంది. సిట్టింగ్ సభ్యుడు గురుప్రీత్ బస్సీ గోగి మరణించడంతో పంజాబ్‌లోని లూథియానా స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించబోతుంది ఈసీ. అలాగే, బెంగాల్‌లోని కలిగంజ్ అసెంబ్లీ స్థానానికి కూడా బై ఎలక్షన్ జరగనుంది. అయితే, ఇండియా కూటమి మిత్రపక్షమైన ఆమ్ ఆద్మీ పార్టీతో భాగస్వామ్యం లేకుండా విశావదర్, కాడి అసెంబ్లీ స్థానాలకు సొంతంగా పోటీ చేయబోతున్నామని గుజరాత్ పీసీసీ చీఫ్ శక్తిసిన్హ్ గోహిల్ గతంలో ప్రకటించారు. ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈ నామినేషన్ల ప్రక్రియ మే 26వ తేదీన ప్రారంభమవుతుంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి తేదీ జూన్ 2. నామినేషన్ల పరిశీలన జూన్ 3వ తేదీన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జూన్ 5వ తేదీగా ఎన్నికల సంఘం ప్రకటించింది.

Exit mobile version