NTV Telugu Site icon

Delhi Elections: ఢిల్లీలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. ఎల్లుండే పోలింగ్

Delhi

Delhi

దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల ప్రచారం ముగిసింది. గత కొద్ది రోజులుగా ప్రధాన పార్టీలన్నీ ప్రచారాలతో హోరెత్తించారు. విమర్శలు.. ప్రతి విమర్శలతో మాటల యుద్ధం సాగించారు. మొత్తానికి సోమవారంతో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఇక బుధవారం ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొంది. మరోసారి అధికారం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నిస్తోంది. ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ కూడా ఎత్తుగడలు వేస్తోంది.

ఆమ్ ఆద్మీ ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ కుదిపేసింది. తొలుత డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జైలుకెళ్లారు. అనంతరం ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జైలుకెళ్లారు. ఇలా ఒక్కొక్కరు జైలుకెళ్లడం పార్టీలో తీవ్ర కలకలం రేపింది. ఇక జైలు నుంచి వచ్చాక.. కేజ్రీవాల్ పదవికి రాజీనామా చేశారు. అనంతరం అతిషి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. అయితే ఢిల్లీ ఓటర్లు ఎవరిని ఆదరిస్తారో వేచి చూడాలి.

ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదలకానున్నాయి.