Site icon NTV Telugu

Milind Deora: మిలింద్ దేవరా శివసేనలో చేరికపై స్పందించిన ఏక్‌నాథ్ షిండే..

Milind Deora

Milind Deora

Milind Deora: కాంగ్రెస్ కీలక నేత మిలింద్ దేవరా ఆ పార్టీకి ఈ రోజు రాజీనామా చేశారు. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరబోతున్నట్లు ప్రచారం జరగుతోంది. దీనిపై సీఎం షిండే స్పందించారు. మిలింద్ దేవరా శివసేనలో చేరానుకుంటే అతడిని స్వాగతిస్తామని అన్నారు. మహారాష్ట్రలో సీనియర్ కాంగ్రెస్ నేతగా ఉన్న మిలింద్ దేవరా ఆ పార్టీకి రాజీనామా చేయడం, ముఖ్యంగా రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ ప్రారంభించే రోజే పార్టీ నుంచి వైదొలగడం సంచలనంగా మారింది. దక్షిణ ముంబై మాజీ ఎంపీ అయిన మిలింద్ దేవరా, కాంగ్రెస్-ఉద్దశ్ ఠాక్రే వర్గాల మధ్య సీట్ల పంపిణీ అంశంపై అసంతృప్తితో ఆయన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Read Also: Housing Crisis: భారత విద్యార్థులకు కెనడా షాక్..? హౌసింగ్ సంక్షోభం నేపథ్యంలో పరిమితి..

దేవర కుటుంబం 55 ఏళ్లుగా కాంగ్రెస్‌తో ఉంది. ఈ రోజు నా రాజకీయ ప్రయాణంలో ఒక ముఖ్యమైన అధ్యాయం ముగిసిందని, తాను కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తు్న్నట్లు మిలింద్ దేవరా ట్వీట్ చేశారు. కొద్ది రోజులుగా శివసేనలో చేరుతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు ఈ రాజీనామా అంశం చర్చకు వచ్చింది. ఇటీవల శివసేన పార్టీ, ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ రాహుల్ నార్వేకర్ తీర్పు వెల్లడించారు. అసలైన శివసేన ఏక్ నాథ్ షిండేదే అని చెప్పిన మూడు రోజుల తర్వాత మిలింద్ దేవరా రాజీనామా చోటు చేసుకుంది.

Exit mobile version