Site icon NTV Telugu

Eknath Shinde: మహారాష్ట్ర సీఎం అభ్యర్థిని రేపు నిర్ణయిస్తారు.. షిండే కీలక వ్యాఖ్యలు..

Shinde

Shinde

Eknath Shinde: మహారాష్ట్ర సీఎం అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఫలితాలు వచ్చి వారం గడిచినా, ఇంకా సీఎం ఎవరనే క్లారిటీ రాలేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఏక్‌నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ ‘‘మహాయుతి’’ కూటమి అఖండ విజయాన్ని సాధించింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో 233 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 132 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. శివసేన 57, ఎన్సీపీ 41 స్థానాలను గెలుచుకున్నాయి.

Read Also: Bihar: పెళ్లికి వెళ్లి మద్యం తాగారు.. 40 మందికి పైగా అరెస్ట్.. అసలు కారణం ఏంటంటే..

అయితే, తాజాగా సీఎం అభ్యర్థి ఎంపికపై అపద్ధర్మ సీఎం ఏక్‌నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. మహాయుతికి చెందిన ముగ్గురు మిత్రుల మధ్య మంచి అవగాహన ఉందని, సీఎం అభ్యర్థిని రేపు నిర్ణయిస్తామని చెప్పారు. ఇటీవల ఢిల్లీ పెద్దల్ని కలిసిన తర్వాత సీఎం షిండే సొంతూరు సతారాకు వెళ్లారు. జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిసింది. తాను ఇప్పుడు బాగానే ఉన్నానని షిండే చెప్పారు. సీఎంగా 2.5 ఏళ్లలో ఎప్పుడూ సెలవు తీసుకోలేదని, ప్రజలన కలవడానికి ఇప్పుడు ఇక్కడికి వచ్చానని అన్నారు. ఈ ప్రభుత్వం ప్రజల మాట వింటుందని, పార్టీ నాయకత్వానికి తాను బేషరతు మద్దతు ఇచ్చానని, అందుకే ప్రజలు తమకు అఖండ విజయాన్ని ఇచ్చారని అన్నారు. ప్రజలు ప్రతిపక్ష నేతను కూడా ఎన్నుకునే అవకాశం ఇవ్వలేదని, ఏ పార్టీకి కూడా ప్రతిపక్ష హోదా దక్కలేదని అన్నారు.

Exit mobile version