Eknath Shinde is unwell: మహారాష్ట్ర సీఎం పదవిపై సస్పెన్స్ కొనసాగుతోంది. గురువారం నాడు ఢిల్లీలో బీజేపీ అగ్ర నేతలతో మహాయుతి నేతలు సమావేశం అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుపై సానుకూల చర్చలు జరిగినట్లు సమావేశం తర్వాత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే చెప్పుకొచ్చారు. ఒకటి లేదా రెండు రోజుల్లో సీఎం అభ్యర్థిని ప్రకటించబోతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఆ అంశంపై చర్చించేందుకు శుక్రవారం ముంబైలో జరగాల్సిన మీటింగ్ సడెన్ గా రద్దైంది. అందుకు కారణం షిండే.. ఉన్న ఫలంగా తన స్వగ్రామం సతారాకు వెళ్లిపోయారు.
Read Also: Fire Accident: వారణాసి రైల్వేస్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 200 బైక్స్
ఇక, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ నుంచి బయటకు వచ్చిన తర్వాత షిండే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.. ఎన్డీయే ప్రతిపాదించిన మహాయుతి కూటమి ఫార్ములా ఆయనకు నచ్చలేదని ప్రచారం కొనసాగింది. ముందస్తు షెడ్యూల్ లేకుండా ఆయన సొంత గ్రామానికి వెళ్లడంతో పలు అనుమానాలకు దారి తీస్తుంది.
Read Also: Cyclone Fengal: ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్.. విద్యాసంస్థలు బంద్, విమాన రాకపోకలకు అంతరాయం
అయితే, ఈ ప్రచారాన్ని శివసేన (షిండే) వర్గం తోసిపుచ్చింది. ఎన్డీయే అధిష్ఠానం నిర్ణయంపై ఏక్ నాథ్ షిండే కలత చెందలేదని.. ఆయన ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత అస్వస్థతకు గురయ్యారని వెల్లడించింది. అందుకే తన స్వగ్రామం సతారాకు వెళ్లినట్లు తెలిపారు. నిన్న రద్దైన భేటీ నేడు (శనివారం) జరిగే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని శివసేన నేత, ప్రస్తుతం ఐటీ మంత్రిగా ఉన్న ఉదయ్ సామంత్ చెప్పుకొచ్చారు.