Site icon NTV Telugu

Eknath Shinde: మాకు వీటిలో ఓ గుర్తు కేటాయించండి.. ఈసీకి ఏక్‌నాథ్‌ షిండే వర్గం విజ్ఞప్తి..

Eknath Shinde

Eknath Shinde

మహారాష్ట్రలో ఉద్ధవ్‌ థాక్రేపై తిరుగుబాటు జెండా ఎగురవేసి.. అందినకాడికి ఎమ్మెల్యేలను లాక్కెళ్లిన ఏక్‌నాథ్‌ సిండే.. ఆ తర్వాత బీజేపీతో చేతులు కలిపి ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు.. శివసేనలో రెబల్‌ వర్గంగా కొనసాగుతున్నారు.. తమదే అసలైన శివసేన అంటున్నారు.. అయితే, అంధేరి ఈస్ట్‌ నియోజకవర్గంలో ఉప ఎన్నిక నేపథ్యంలో.. ఇప్పుడు ఎన్నికల గుర్తులు తెరపైకి వచ్చాయి.. ఇప్పటికే శివసేన ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం తమ ఆప్షన్లను ఈసీకి సమర్పించింది. మూడు గుర్తులు ఎంచుకుంది.. త్రిశూలం, ఉద‌యించే సూర్యుడు, కాగ‌డా గుర్తులను ఈసీకి సమర్పించిన థక్రే వర్గం.. ఇక, శివ‌సేన‌ (బాలాసాహెబ్ ఠాక్రే), శివసేన (ప్ర‌బోధంక‌ర్ ఠాక్రే), శివ‌సేన (ఉద్ధ‌వ్ బాలాసాహెబ్ ఠాక్రే) లాంటి పేర్లను కూడా పార్టీకి సూచించింది.. పై మూడు గుర్తుల్లో ఏ గుర్తు ఇచ్చినా, ఆ పేర్లలో ఏ పేరు ఖ‌రారు చేసినా తమకు ఓకేనని పేర్కొన్నారు..

Read Also: Hyderabad Cricket Association: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌పై మరో కేసు

ఇక, ఇప్పుడు సీఎం ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేన రెబల్‌ వర్గం.. కూడా ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేసింది.. బాకా, కత్తి వంటి వాటిని ఎన్నికల గుర్తులుగా ఎంచుకున్నారు.. ఈ మేరకు ఈసీకి చిహ్నాల జాబితాను సమర్పించారు.. బాకా, మొద్దుబారిన చిట్టడవి, కత్తి వంటి వాటిని తమ వర్గం చిహ్నంగా పరిగణించాలని పేర్కొన్నారు.. అంటే, రాబోయే అంధేరీ ఈస్ట్ అసెంబ్లీ ఉపఎన్నికలో థాకరే మరియు ఏక్‌నాథ్ షిండే వర్గాలు పార్టీ పేరు మరియు ఎన్నికల గుర్తును ఉపయోగించకుండా ఎన్నికల సంఘం నిషేధించింది. అక్టోబర్ 1, 1989న విల్లు మరియు బాణం గుర్తును నమోదు చేయడానికి ముందు శివసేన.. కొబ్బరి చెట్టు, రైల్వే ఇంజిన్, కత్తి మరియు డాలు, మషాల్, కప్పు మరియు సాసర్ వంటి చిహ్నాలను ఉపయోగించింది… ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గం తన మూడు ఎన్నికల చిహ్న ఎంపికలను ఆదివారం ఎన్నికల కమిషన్ సమర్పించగా.. ఇవాళ షిండే వర్గం ఈసీకి విజ్ఞప్తి చేసింది.

Exit mobile version