Site icon NTV Telugu

Delhi: ఢిల్లీలో మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎం.. అమిత్ షాతో కీలక చర్చలు

Eknath Shinde Meet Amit Shah

Eknath Shinde Meet Amit Shah

మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడంతోపాటు పలు అంశాలపై ముగ్గురు నేతల మధ్య చర్చలు జరిగాయి. కొత్తగా నియమితులైన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌లు అమిత్ షాను కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. నరేంద్ర మోడీ మార్గదర్శకత్వంలో ప్రజలకు సేవ చేయడం ద్వారా మహారాష్ట్రను అభివృద్ధిలో కొత్త శిఖరాలకు తీసుకెళ్తారని తాను నమ్ముతున్నట్లు.. అమిత్ షా ట్వీట్ చేశారు. నేడు ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఏక్‌నాథ్ షిండే భేటీ కానున్నారు. సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ కానున్న ఆయన.. ఉదయం రాష్ట్రపతితో సమావేశం కానున్నారు.

మహారాష్ట్ర కొత్త ప్రభుత్వంలో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేయగా, మిగిలిన మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. షిండే శిబిరంలో డజను మందికి పైగా మంత్రులను చేయవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఉద్ధవ్ ప్రభుత్వంలోని ప్రస్తుత ఎనిమిది మంది మంత్రులు షిండేతో పాటు అతని తిరుగుబాటుకు సహకరించారు. ఇలాంటి పరిస్థితుల్లో వారందరికీ మరోసారి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది.

Parliament Sessions: కొవిడ్‌ నిబంధనల మధ్య వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు

మహావికాస్ అఘాడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సేన ఎమ్మెల్యేల బృందానికి ఏకనాథ్ షిండే నాయకత్వం వహించిన విషయం తెలిసిందే. ఫలితంగా మహారాష్ట్ర అసెంబ్లీలో ఎంవీఏ సర్కారు మెజారిటీ కోల్పోగా.. శివసేన అధినేత థాకరే బలపరీక్షకు ముందే సీఎం పదవి నుంచి తప్పుకున్నారు. అనంతరం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం బలనిరూపణ పరీక్షలో 164-99 తేడాతో విజయం సాధించింది. షిండేకు అనుకూలంగా 164 ఓట్లు పోల్ కాగా, కొత్తగా ఏర్పాటైన బీజేపీ-షిండే క్యాంపు కూటమికి వ్యతిరేకంగా 99 ఓట్లు పోలయ్యాయి.బీజేపీకి చెందిన రాహుల్ నార్వేకర్ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికైన మరుసటి రోజే విశ్వాస పరీక్ష జరిగింది. అనంతరం నార్వేకర్ శివసేన శాసనసభా పక్ష నేతగా షిండేను తిరిగి నియమించారు. శివసేన చీఫ్ విప్‌గా గోగావాలే నియామకమయ్యారు.

Exit mobile version