Dharmendra Pradhan: నీట్‌పై చర్చకు సిద్ధం.. విద్యార్థుల పేరుతో రాజకీయాలు వద్దు రాహుల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharmendra Pradhan: దేశ రాజధాని ఢిల్లీలో విద్యా సంస్కరణలు, ప్రశ్నపత్రాల లీకేజీలపై కొనసాగుతున్న ఆందోళనలు రాజకీయంగా మరింత వేడెక్కాయి. కాంగ్రెస్ చేపట్టిన నిరసనలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందిస్తూ, విద్యార్థుల సమస్యలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవద్దని కాంగ్రెస్‌కు సూచించారు. ముఖ్యంగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విద్యార్థుల పేరుతో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ప్రధాని నివాసం ఎదుట కాంగ్రెస్ చేపట్టిన ధర్నా ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగించిందని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఇలాంటి నిరసనలతో భద్రతా నిబంధనలు కూడా ఉల్లంఘించబడుతున్నాయని పేర్కొన్నారు. రాజకీయ ప్రచారం కోసం దేశ విద్యార్థులను అడ్డుపెట్టుకోవడం సమంజసం కాదని, వారి పట్ల అన్ని రాజకీయ పార్టీలు గౌరవప్రదంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఇక, నీట్ పరీక్షలు, ప్రశ్నపత్రాల లీకేజీల అంశంపై సమగ్ర చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. యువత ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.
Also Read
- PM Modi Chintan Shibir 2026: వికసిత్ భారత్ 2047పై ఫోకస్.. నేటి నుంచి ప్రధాని మోడీ ‘చింతన్ శిబిర్’
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
- Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
- Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
మరోవైపు, విద్యా సంస్కరణలు, ప్రశ్నపత్రాల లీకేజీలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఉద్యమానికి కాంగ్రెస్ అధికారికంగా మద్దతు ప్రకటించింది. జూలై 21న రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ నాయకులు ప్రధానమంత్రి నివాసం వైపు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌తో పాటు పలువురు ప్రతిపక్ష నాయకులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, విద్యా సంస్కరణల కోసం ఉద్యమం చేస్తున్న కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ తన నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. జూలై 20న జనపథ్ మెట్రో స్టేషన్ పరిసరాల్లో నిరసనలు తీవ్రరూపం దాల్చగా, నిరసనకారులు మరియు ఢిల్లీ పోలీసులు మధ్య పలుమార్లు ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు.. అనంతరం జంతర్ మంతర్‌లోని నిరసన శిబిరాలను తొలగించినప్పటికీ, నిరసనకారులు మళ్లీ అక్కడికి చేరుకుని తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు.
LoP Shri @RahulGandhi and @INCIndia continue to shamelessly exploit students as political tools to manufacture disruption during the Monsoon Session of Parliament.
Shri @RahulGandhi and @INCIndia chose to stage a dharna outside the Hon'ble Prime Minister's residence , causing…
— Dharmendra Pradhan (@dpradhanbjp) July 21, 2026
తాజావార్తలు
-
Dont Trouble The Trouble : బాలకృష్ణ వాయిస్ ఓవర్‌తో ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’
-
PM Modi Chintan Shibir 2026: వికసిత్ భారత్ 2047పై ఫోకస్.. నేటి నుంచి ప్రధాని మోడీ ‘చింతన్ శిబిర్’
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!