NTV Telugu Site icon

Edible oil prices: దిగిరానున్న వంటనూనెల ధరలు.. దిగుమతి సుంకాన్ని తగ్గించిన కేంద్రం

Oil Priceses

Oil Priceses

Edible oil prices: ధరలతో అల్లాడుతున్న ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆయిల్ పై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. దీంతో వంట నూనెల ధరలు దిగిరానున్నాయి. ముఖ్యంగా రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్ పై దిగుమతి సుంకాన్ని 17.5 శాతం నుంచి 12.5కి తగ్గించింది ప్రభుత్వం. ఈ చర్యల వల్ల వంటనూనెల మార్కెట్లో స్థిరత్వం ఏర్పడటంతో పాటు ముడి, శుద్ధి చేసిన నూనెల దిగుమతుల మధ్య సమతుల్యత సాధించేందుకు దోహదం చేస్తుంది. ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం గురువారం నుంచి ఈ చర్యలు అమలులోకి వస్తాయి.

భారతదేశం 60 శాతం వంట నూనెలను దిగుమతి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు దిగుమతి సుంకాన్ని తగ్గించడంతో ధరలు తగ్గే అవకాశం ఏర్పడింది. 2023 ఏప్రిల్ నెలలో భారత్ 1.05 మిలియన్ టన్నుల వంట నూనెను దిగుమతి చేసుకుంది. ఇది గతేడాదితో పోలిస్తే 15 శాతం ఎక్కువ.

Read Also: Fire Accident: కోచింగ్‌ సెంటర్‌లో భారీగా చెలరేగిన మంటలు.. విద్యార్థులకు గాయాలు

భారత్ ప్రతీ ఏడాది దాదాపుగా 24 మిలియన్ టన్నుల ఆహార నూనెల్ని ఉపయోగిస్తుంది. ఇందులో దాదాపుగా 14 మిలియన్ టన్నుల్ని దిగుమతి చేసుకుంటుంది. కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పుడు క్రూడ్ పామాయిల్, క్రూడ్ సన్ ఫ్లవర్, క్రూడ్ సోయాబీన్ ఆయిల్ పై దిగుమతి సుంకం 5 శాతం విధించబడుతుంది. రిఫైన్డ్ ఎడిబుల్ ఆయిల్ పై ఫఫెక్టివ్ సుంకం 13.75 శాతంగా ఉంది. రిఫ్లైన్ ఆయిల్ పై 12.5 శాతం దిగుమతి సుంకంతో పాటు 10 శాతం సెస్ ఉంటుంది.

నవంబర్ 2022 నుంచి ఏప్రిల్ 2023 వరకు పామాయిల్ దిగుమతి భారీగా పెరిగింది. గతేడాదిలో ఇది 32 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే.. ఈ ఏడాది 59 లక్షల మెట్రిక్ టన్నులు ఉంది. ఈ కాలంలో పామాయిల్ దిగుమతి 61 శాతం పెరగ్గా, ఇతర నూనెల దిగుమతి వాటా 49 శాతానికి తగ్గింది.