ED Raids On AAP MP House: పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపీ సంజీవ్ ఆరోరా ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఈరోజు (సోమవారం) తనిఖీలు చేశారు. ఒక భూ వివాదానికి సంబంధించిన మనీలాండరింగ్ వ్యవహారంలో జలంధర్‌లోని ఎంపీకి చెందిన పలు చోట్ల సోదాలు కొనసాగిస్తుంది. ఈ రైడ్స్ పై ఆప్ కీలక నేత మనీష్ సిసోడియా ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పందించారు. పార్టీని చీల్చేందుకే ఎంపీ సంజీవ్ అరోరా ఇంట్లో ఈడీ తనిఖీలు చేస్తుందని విమర్శలు గుప్పించింది. అలాగే, ఈడీ, సీబీఐలతో ఆప్ సభ్యులను ఆపలేరని, ఎవరినీ మీరు కొనలేరని, మమల్ని భయపట్టలేరని మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేర్కొన్నారు.
Read Also: Nithilan Saminathan : హిట్టు కొట్టాడు.. BMW కార్ పట్టాడు..
ఇక, మోడీజీ నకిలీ కేసుల తయారీ యంత్రం ఆమ్ ఆద్మీ పార్టీని 24 గంటలూ వెంటాడుతూనే ఉంటుందని ఆప్ రాజ్యసభ సభ్యులు సంజయ్ సింగ్ మండిపడ్డారు. తప్పుడు కేసులు పెట్టడం మానేయాలని సుప్రీంకోర్టు కూడా పలుమార్లు మందలించింది.. ఈడీ, సీబీఐ సంస్థలు కోర్టుకు కట్టుబడి ఉండవు.. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల ధైర్యం ముందు మోడీజీ అహంకారం పూర్తిగా విఫలమవుతుంది అని విమర్శించారు. వ్యాపారవేత్త కూడా అయిన ఎంపీ సంజీవ్ అరోరాపై ఈడీ దాడులతో తమ ధైర్యాన్ని దెబ్బ తీయలేరని సంజయ్ సింగ్ వెల్లడించారు.