రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ నోటీసులు జారీ చేసింది. రూ.17,000 కోట్లు విలువైన లోన్ మోసం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఆగస్టు 5న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈడీ విచారణ చేయనుంది.
ఇది కూడా చదవండి: Deccan Kitchen Case: కోర్టుకు వెంకటేష్, రానా, సురేష్ బాబు
జూలై 24న ముంబైలో అనిల్ అంబానీ గ్రూపుకు చెందిన 35 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. 50 కంపెనీలు, 25 మంది బిజినెస్ పార్ట్‌నర్స్ ఇళ్లపై మూడ్రోజుల పాటు సోదాలు నిర్వహించింది. రిలయన్స్ గ్రూపుకి చెందిన అనేక ఆస్తులు, లావాదేవీలపై కూడా ఈడీ అధికారులు దృష్టి పెట్టారు. ఇక గురువారం కూడా నాలుగు ప్రాంగణాల్లో వరుస సోదాలు నిర్వహించింది. భువనేశ్వర్‌లో మూడు, కోల్‌కతాలో ఒక చోట సోదాలు చేశారు. తాజా దర్యాప్తులో రూ.68 కోట్ల నకిలీ బ్యాంక్ గ్యారెంటీ అభియోగం మోపబడింది.
ఇది కూడా చదవండి: Triangle Love: ఒక యువతిని ప్రేమించిన ఇద్దరు విద్యార్థులు.. ఒకరు హత్య
అనిల్ అంబానీకి చెందిన కంపెనీలు రూ.వేల కోట్ల విలువైన బ్యాంకు రుణ మోసానికి పాల్పడ్డాయనే ఆరోపణలపై ఈడీ కేసు నమోదైంది. 2017-19 మధ్య అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలకు యెస్ బ్యాంక్ ఇచ్చిన రూ.3,000 కోట్ల రుణాలు చట్టవ్యతిరేక పద్ధతుల్లో దారిమళ్లాయన్న ఆరోపణలు వచ్చాయి. ఆ బ్యాంక్ మాజీ ప్రమోటర్లకు లంచం ఇచ్చారన్న అభియోగాలు ఉన్నాయి. రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్న రూ.10వేల కోట్ల రుణాలను కూడా దారి మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి.
