Satyender Jain: మంత్రి సత్యేంద్ర జైన్ ఇంట్లో ఈడీ సోదాలు ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. గతనెల 30న మనీలాండరింగ్ కేసులో సత్యేంద్రను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరిన్ని ఆధారాల కోసం ఇవాళ (సోమవారం) తెల్లవారుజాము నుంచి ఢిల్లీలోని ఆయన ఇంటిపై అధికారులు దాడులు నిర్వహించారు.
కోల్ కత్తాకు చెందిన ఓ కంపెనీకి సత్యేంద్ర జైన్ అక్రమంగా డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసినట్లు ఈడీ నిర్ధారించింది. ఈ కేసులో సత్యేంద్ర జైన్, ఆయన బంధువులకు సంబంధాలున్నాయని భావిస్తున్న కంపెనీలకు చెందిన 4.81కోట్ల విలువైన స్థిరాస్థులను ఈడీ గత ఏప్రిల్‌లోనే జప్తు చేసింది. సత్యేంద్రజైన్ పై 2017లో నమోదైన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. జూన్ 9 వరకు సత్యేంద్ర ఈడీ కస్టడీలో ఉండనున్నారు.
Also Read
- MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
- Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
- Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
- NEET UG 2026: నీట్ రీ-ఎగ్జామ్ కు ముందు.. పేపర్ లీక్ వదంతులపై విద్యార్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి..
కాగా.. ఆప్ ప్రారంభం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్న సత్యేంద్ర జైన్ ఢిల్లీలోని షాకూర్ బస్తీ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అరవింద్ కేజ్రీవాల్ కేబినెట్‌లోని ఏడుగురు మంత్రుల్లో ఒకరిగా సత్యేంద్ర జైన్ కొనసాగుతున్నారు. ఆరోగ్య శాఖతో పాటు పరిశ్రమలు, పట్టణాభివృద్ధి, విద్యుత్, హోం శాఖల మంత్రిగా సత్యేంద్ర జైన్ కొనసాగుతున్నారు.
అయితే.. ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్ విషయంలో ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై విరుచుకుపడ్డారు. తమ మంత్రిపై అక్రమంగా కేసు మోపారని, రాజకీయ కారణాలతో ఆయనపై కేసు పెట్టారని అన్నారు. తమ పార్టీ, ప్రభుత్వాలు నిజాయితీకి కట్టుబడి ఉన్నాయని, అవినీతిని సహించమన్నారు. ఈ కేసులో మంత్రి సత్యేంద్ర జైన్ పై వచ్చిన ఆరోపణల్లో ఒక్క శాతమైన నిజమున్నట్లు తేలినా తానే స్వయంగా ఆయనపై చర్యలు తీసుకునేవాడినని చెప్పిన విషయం తెలిసిందే..
Noro Virus: కేరళలో చిన్నారులకు సోకిన కొత్త వైరస్.. చికిత్స చేయకపోతే..
తాజావార్తలు
-
UPI Safety: ఈ చిన్న పొరపాట్లు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావొచ్చు.. యూపీఐ వాడేవారు తప్పక తెలుసుకోవాలి.!
-
Kings and Queens Pub: కూకట్‌పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్‌పై పోలీసుల ఆకస్మిక దాడులు.. 9 మంది అదుపులోకి
-
Raviteja : ‘ఇరుముడి’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. సరైన డేట్ లాక్ చేసిన మేకర్స్
-
Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్‌కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
-
Nana Patekar Slap Incident : నానాపటేకర్ నన్ను చెంపదెబ్బ కొట్టింది నిజమే! ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!