Rajnath Singh: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆర్జేడీ నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జైల్లో ఉన్నవారు, బెయిల్‌పై ఉన్నవారు ప్రధాని నరేంద్రమోడీని జైలుకు పంపాలని మాట్లాడుతున్నారని, లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసాభారతీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఆర్జేడీ నాయకుడు, లాలూ కొడుకు తేజస్వీ యాదవ్ కొన్ని వర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నవరాత్రుల్లో మాంసాహారం తింటున్నారని ఆరోపించారు. ‘‘నవరాత్రుల్లో చేపలు తింటున్నాము. ఏం సందేశం ఇవ్వాలని అనునకుంటున్నావు. చేపలు, పందులు, పావురం, ఏనుగు, గుర్రం ఏది కావాలంటే అది తిను, ఇందులో అందరికి చూపించాల్సిన అవసరం ఏం ఉంది.. దీని కారణంగా ఒక నిర్ధిష్ట మతానికి చెందిన ప్రజలు తమకు ఓట్లు వేస్తారని భావిస్తున్నారు.’’ అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మెజారిటీ వర్గం మనోభావాలను వీరు బుజ్జగింపు రాజకీయాల కోసం దెబ్బతిస్తున్నారని ఆరోపించారు.
Read Also: Maldives: మాల్దీవులను విడిచిపెట్టిన 2వ బ్యాచ్ భారత సైనిక సిబ్బంది.. ప్రకటించిన మహ్మద్ ముయిజ్జూ..
బీహార్‌లోని జముయిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఎన్డీయే అభ్యర్థి రామ్ విలాస్ పాశ్వాన్ బావ అరుణ్ భారతికి మద్దతు ఇచ్చేందుకు రాజ్‌నాథ్ సింగ్ అక్కడికి వెళ్లారు. ఇటీవల తేజస్వీ యాదవ్ చేపలు తింటున్న వీడియో వైరల్ అయింది. నవరాత్రుల సందర్భం ఇలాంటి పనులు చేయడమేంటని బీజేపీ ప్రశ్నిస్తోంది.
జైలులో ఉన్నవారు, బెయిల్‌పై ఉన్నవారు మోడీని జైలుకు పంసిస్తారా..? బీహార్ ప్రజలు అన్నింటిని సహిస్తారు, కానీ దీన్ని కాదు అని ఆర్జేడీ నాయకులపై ఆయన ఫైర్ అయ్యారు. బీజేపీ హామీ ఇచ్చినట్లుగా ఆర్టికల్ 370 రద్దు, రామమందిర నిర్మాణం వంటివి నెరవేర్చామని, రామ్ లల్లా తన గుడిసెను వదిలి రాజభవనంలోకి ప్రవేశించారని ఆయన అన్నారు. ఇండియాలో రామరాజ్యాన్ని ఎవరూ ఆపలేరని చెప్పారు. నరేంద్రమోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారని ప్రపంచమంతా చెబుతోంది. వచ్చే ఏడాది జరిగే కార్యక్రమాలకు ప్రపంచదేశాలు ఆయనను ఆహ్వానించాయని చెప్పారు.