Site icon NTV Telugu

Bahubali Samosa: ఈ సమోసా తింటే రూ.51 వేలు మీవే..!

Bahubali Samosa

Bahubali Samosa

కొన్ని విచిత్రమైన పోటీలు ఉంటాయి.. వాటి వెనుక పబ్లిసిటీ స్టంటే ఉంటుంది.. తాజాగా, ఓ స్వీట్‌ షాపు నిర్వహకుడు ఓ భారీ సమోసా తయారు చేయించాడు.. దానికి సైజుకు తగ్గట్టుగానే ‘బాహుబలి’గా నామకరణం చేశాడు.. ఇక, ఆ సమోసా తిన్నవారికి రూ.51 వేల బహుమతి ప్రకటించాడు.. అయితే, ఎక్కడైనా షరతులు ఉంటాయి కదా.. ఆ సమోసా తినడానికి కూడా కొంత టైం కేటాయించాడు.. అయితే, ఈ వార్త సోషల్‌ మీడియాకు ఎక్కి రచ్చ చేస్తోంది.. ఈ దెబ్బతను ఆ స్వీట్‌ షాపునకు కావాల్సిన పబ్లిసిటీ వచ్చేసింది.. మరింత మంది కస్టమర్లను ఆకర్షిస్తోంది..

Read Also: SSMB 28 : ఆగస్ట్ నుంచే మహేశ్, త్రివిక్రమ్ సినిమా

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన శుభమ్‌‌ కౌశల్‌ అనే వ్యక్తి లాల్‌కుర్తి బజార్‌లో కౌశల్ స్వీట్ షాపు నిర్వహిస్తున్నాడు.. రకరకాల స్వీట్లు, ఇతర తినుబండారాలను కూడా విక్రయిస్తుంటాడు.. తన షాపులో తయారు చేసే సమోసాలు చాలా ఫేమస్.. అయితే, గతంలో పబ్లిసిటీ కోసం ఓ ఫుడ్‌ చాలెంజ్‌ పెట్టాడు కౌశల్.. 4 కిలోల సమోసా తయారు చేసి.. అది తింటే రూ. 11 వేలు ఇస్తానని ప్రకటించాడు. దీంతో, కౌశల్ స్వీట్ షాపు పేరు మారుమోగిపోయింది.. మరింత మంది కస్టమర్లను ఆకర్షించింది.. అయితే, కరోనా సమయంలో.. అన్ని వ్యాపారాలు దెబ్బతిన్నాయి.. ఈ నేపథ్యంలో రకరాల ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షించే పనిలో పడిపోయారు.. ఇప్పుడు కౌశల్‌ మరో ఐడియా వేశాడు.. ఈ సారి ఏకంగా 8 కేజీల సమోసా చేయించాడు.. ఆ సమోసాకు ‘బాహుబలి’ సమోసాగా పేరు పెట్టాడు.. ఆ సమోసాను అర గంటలో తింటే.. రూ. 51 వేల బహుమతి ప్రకటించడంతో.. ఆ స్వీట్‌ షాపు పేరు మరోమారు మారుమోగుతోంది.. మీరట్‌లోనే కాదు.. యూపీ మొత్తం, అంతేందుకు దేశవ్యాప్తంగా దానిపై చర్చ జరిగేలా చేసింది. అయితే, చాలా మంది ఆ సమోసాలను తినడానికి యత్నించి విఫలం అవుతున్నారట.. ఏకంగా 8 కిలోల సమోసా కావడంతో.. రూ.51 వేల ఫ్రైజ్‌ మనీ కోసం పోటీకి దిగినా.. తినలేక చేతులెత్తేస్తున్నారు.. చివరకు ఆ సమోసా ధరను చెల్లించి వెళ్లిపోతున్నారు. మొత్తంగా డబ్బుకు డబ్బు.. పబ్లిసిటీకి పబ్లిసిటీ.. అన్ని తెచ్చిపెట్టింది బాహుబలి సమోసా ఐడియా.

Exit mobile version