గతేడాది రిలీజ్ అయిన కాంతార సినిమాపై ఆడియెన్స్ వసూళ్ల వర్షం కురిపించారు. కెజియఫ్ తర్వాత హోంబలే ఫిల్మ్స్ కి భారీ విజయాన్ని ఇచ్చింది కాంతార. కేవలం 16 కోట్ల బడ్జెట్‌తో ఒక రీజనల్ సినిమాగా తెరకెక్కిన కాంతార, ముందుగా కన్నడ భాషలో మాత్రమే రిలీజ్ అయ్యింది. అక్కడి హిట్ టాక్, క్లాసిక్ స్టేటస్ అందుకోవడంతో కాంతార సినిమా బౌండరీలు దాటింది. పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర 450 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టి కాంతార సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెచ్చే క్లైమాక్స్ కాంతార సినిమా చూపించింది. ఒక కొత్త విజువల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన కాంతార సినిమాకి సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కాంతారకి సీక్వెల్ కాదు ప్రీక్వెల్ వస్తుంది అంటూ రిషబ్ శెట్టి స్టేట్మెంట్ ఇవ్వడంతో, ఫాన్స్ వెయిటింగ్ మరింతగా పెరిగింది. ఇప్పటికే కాంతార 2 స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలయ్యింది. ఈ క్రమంలో కాంతార ప్రీక్వెల్ గురించి లేటెస్ట్ అప్టేడ్ ఒకటి వైరల్‌గా మారింది.
ఇప్పటికే కాంతార 2 స్క్రిప్ట్ మొదటి డ్రాఫ్ట్ ఫైనల్ రెడీ అయ్యిందని తెలుస్తోంది. స్క్రిప్ట్ విషయంలో రిషబ్ ఫుల్ హ్యాపిగా ఉన్నాడట. త్వరలోనే స్క్రిప్ట్‌ని లాక్ చేయనున్నాడని KFIలో వినిపిస్తున్న మాట. మేకర్స్ స్క్రిప్ట్ వర్క్ తో పాటు కాస్ట్యూమ్, లోకేషన్ ఇతర ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా వేగవంతం చేస్తున్నారట. ఇప్పటికే కోస్టల్ కర్ణాటకలో కొన్ని లోకేషన్స్‌ను ఫైనల్ చేసినట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే కాంతార ప్రీక్వెల్ ఆగస్టు 27 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకునే అవకాశం ఉంది. 2024 రిలీజ్ టార్గెట్ గా రిషబ్ కాంతార ప్రీక్వెల్ ని స్టార్ట్ చేస్తాడు. రెగ్యులర్ షూటింగ్ కి సంబంధించిన అనౌన్స్మెంట్ నుంచే పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా కాంతార 2 ప్రమోషన్స్ జరుపుకోనుందని కన్నడ మీడియా ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తోంది.