Site icon NTV Telugu

S. Jaishankar: నేటి నుంచి మూడు రోజులు ఖతార్లో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్

Jai Shankar

Jai Shankar

S. Jaishankar: భారత విదేశాంగ శాఖ మంత్రి S. జైశంకర్ నేటి నుంచి మూడు రోజుల పాటు ఖతార్ లో పర్యటించడానికి వెళ్తున్నారు. ఇక, తన పర్యటనలో ఖతార్ ప్రధాన మంత్రితో పాటు విదేశాంగ మంత్రి, హెచ్ఈ షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో రాజకీయ, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, భద్రత, సాంస్కృతిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలతో సహా రెండు దేశాల ప్రజలకు పరస్పర ప్రయోజనాలపై సమీక్షిస్తారు.

Read Also: NBK 109 : డాకు మహారాజ్ స్పెషల్ సాంగ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

ఈ పర్యటనలో భారత్- ఖతార్ మధ్య ఉన్నత స్థాయి చర్చలను కొనసాగనున్నాయి. అలాగే, గల్ఫ్ దేశాలతో సంబంధాలను పెంపొందించుకోవడంలో భారతదేశం ఉత్సాహభరితంగా ఉంది. అయితే, అంతకుముందు డిసెంబర్ 7వ తేదీన భారత విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ ఖతార్ ప్రధానమంత్రితో భేటీ అయ్యారు. గాజా, సిరియాలో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. ఇక, విదేశాంగ మంత్రిగా ఉన్న అల్ థానీ ఆహ్వానం మేరకు జైశంకర్ దోహా ఫోరమ్‌లో పాల్గొనేందుకు దోహాను సందర్శించారు.

Exit mobile version