Rahul Gandhi at Cambridge: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మక కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కీలక విషయాలను వెల్లడించారు. తాను భారత్ జోడో యాత్రలో భాగంగా కాశ్మీర్ లో పర్యటించినప్పుడు జరిగిన ఓ సంఘటనను అక్కడ ఉన్నవారితో పంచుకున్నారు. ఉగ్రవాద ప్రభావం ఉండటం వల్ల కాశ్మీర్ లో యాత్ర చేయొద్దని భద్రతా బలగాలు తనను కోరాయని, అయితే తాను మాత్రం యాత్రను కొనసాగించేందుకు నిర్ణయించుకున్నానని చెప్పారు.
Read Also: Amazon Jungle: పురుగులు తింటూ, మూత్రం తాగుతూ.. 31 రోజులు అమెజాన్ అడవిలో బతుకుపోరాటం
ఆయన ‘ లర్నింగ్ టూ లిజన్ ఇన్ 21 సెంచరీ’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. ఈ సమయంలో భారత్ జోడో యాత్రలో జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. నేను భారత్ జోడో యాత్రలో భాగంగా ప్రజలతో మాట్లాడాలని అనుకున్నానని, కాశ్మీర్ లో యాత్ర జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి తన వద్దకు వచ్చి మాట్లాడాలని అనుకున్నారని, అతను ప్రజలు కష్టాలు తెలుసుకోవడానికి కాంగ్రెస్ నాయకులు కాశ్మీర్ వచ్చారా..? అని తనను అడిగాడని అన్నారు. కొద్ది సేపటి తర్వాత అతను దూరంగా ఉన్న కొందరు వ్యక్తల వైపు చూపుతూ.. వారంతా ఉగ్రవాదులు అని చెప్పాడని రాహుల్ గాంధీ తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఉగ్రవాదులు నన్ను చంపేస్తారని నేను ఇబ్బందుల్లో ఉన్నానని అనుకున్నాని, కానీ వారు ఏమీ చేయలేదని అన్నారు. ఎందుకంటే ఇది వినడానికి ఉన్న శక్తి అని ఆయన అన్నారు.
అంతకుముందు రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, ఇజ్రాయిల్ స్పైవేర్ పెగాసస్ ద్వారా కాంగ్రెస్ నేతలపై నిఘా పెడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. మీడియాను, న్యాయవ్యవస్థను కబ్జా చేసి నియంత్రిస్తున్నారని, మైనారిటీలు, దళితులు, గిరిజనులపై దాడులుకు పాల్పడుతున్నారని ఆరోపించారు.