Site icon NTV Telugu

Shahid Afridi: “కేరళ కమ్యూనిటీ” ఈవెంట్‌కి అతిథిగా షాహిద్ అఫ్రిది.. ‘‘సిగ్గు లేదు’’ అని నెటిజన్లు ఫైర్..

Shahid Afridi

Shahid Afridi

Shahid Afridi: దుబాయ్‌లో కేరళ గ్రూప్ నిర్వహించిన ఓ కార్యక్రమానికి అతిథులుగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు షాహిద్ అఫ్రిది, ఉమర్ గుల్ రావడం తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. దుబాయ్‌లోని కేరళ కమ్యూనిటీపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత వ్యతిరేకి అయిన షాహిద్ అఫ్రిదిని ఆహ్వానించడంపై భారత సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కొచ్చిన్ యూనివర్సిటీ బి.టెక్ పూర్వ విద్యార్థుల సంఘం (CUBAA) గత వారం పాకిస్తాన్ అసోసియేషన్ దుబాయ్ (PAD)లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. అయితే, దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో CUBAA ఒక ప్రకటన విడుదల చేసింది, పాకిస్తానీ క్రికెటర్లు ఆహ్వానం లేకుండానే ఆ కార్యక్రమానికి హాజరయ్యారని, అదే వేదికలో వేరే కార్యక్రమానికి హాజరవుతున్నారని పేర్కొంది.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్‌గా మారింది. వీడియోలో షాహిద్ అఫ్రిది, ఉమర్ గుల్‌ని కేరళ కమ్యూనిటీ సాదరంగా ఆహ్వానించడం చూడవచ్చు. అఫ్రిది వేదికపైకి వచ్చినప్పుడు కింద ఉన్న వారు ‘‘ బూమ్ బూమ్’’ అని నినాదాలు చేశారు. అయితే, దీనికి ప్రతిస్పందనగా అఫ్రిది ‘‘హోగయా బూమ్ బూమ్’’ అని ప్రతిస్పందించాడు. తాను కేరళ ఫుడ్‌కి పెద్ద అభిమాని అని చెప్పడం వినవచ్చు.

Read Also: APPSC Scam: ఏపీపీఎస్సీ గ్రూపు 1 కేసు.. రిమాండ్ ఖైదీగా ఉన్న పీఎస్సార్ ఆంజనేయులుకు అస్వస్థ..!

అయితే, భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలు ఉన్న సమయంలో భారత ఆర్మీని కించపరిచేలా వ్యాఖ్యానించిన అఫ్రిది వంటి వ్యక్తిని కార్యక్రమానికి ఆహ్వానించడం ఏంటని భారత నెటిజన్లు ఎస్ఎంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఇది సిగ్గులేని తనం’’ అని విమర్శించారు. ఈ కార్యక్రమానికి హాజరైన భారతీయులపై ఎన్ఐఏ విచారణ జరపాలని, వారి పౌరసత్వాన్ని రద్దు చేయాలని మరొకరు డిమాండ్ చేశారు. భారత్‌పై విషం చిమ్మే ఆఫ్రిది వంటి వ్యక్తిని కార్యక్రమానికి ఆహ్వానించడం ఏంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు నిజంగా కేరళ 100 శాతం అక్షరాస్యత కలిగిన రాష్ట్రమా..? అని ప్రశ్నిస్తున్నారు.

పహల్గామ్ టెర్రర్ అటాక్‌పై అఫ్రిది నీచమైన వ్యాఖ్యలు చేశాడు. ‘‘కాశ్మీర్లో 8 లక్షల మంది భారత సైన్యం ఉన్న ఉగ్రవాద దాడిని ఆపలేదని, వారంతా అసమర్థులు’’ అంటూ అఫ్రిది భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కాడు. ఇదే కాకుండా, ఆపరేషన్ సిందూర్‌ తర్వాత భారత్‌పై పాక్ ఆర్మీ విజయం సాధించిందని పెద్ద ఎత్తున విక్టరీ ర్యాలీలు నిర్వహించాడు.

Exit mobile version