Son in Law Cheating: పిల్లనిచ్చిన మామకే శఠగోపం.. 107 కోట్లు కాజేసిన అల్లుడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Son in Law Cheating: నమ్మి తన కూతురునిచ్చి పెళ్లి చేసిన మామకే శఠగోపం పెట్టాడు ఓ అల్లుడు. మాయమాటలతో నమ్మించి మామ దగ్గర నుంచి రూ.107 కోట్లు కాజేశాడు. దుబాయ్‌కి చెందిన ఎన్నారై వ్యాపారవేత్త అబ్దుల్ లాహిర్ హసన్ తన కుమార్తె వివాహాన్ని 2017లో కాసర్‌గోడ్‌కు చెందిన కేరళీయుడైన మహమ్మద్ హఫీజ్‌తో జరిపించారు. పెళ్లి అనంతరం తన వ్యాపారంలో కొన్ని యాజమాన్య హక్కులను కూడా ఇచ్చారు. తన కుమార్తెకు ఆభరణాలు బహుమతిగా ఇచ్చాడు. ఈ క్రమంలో తనపై ఈడీ దాడులు జరిగాయని, జరిమానా చెల్లించాలని హాసన్ నుంచి రూ.4 కోట్లను హఫీజ్ తీసుకున్నాడు. ఇలా అతని మోసాలు మొదలయ్యాయి. దాని తర్వాత భూమి కొనుగోలు చేయాలని, పాదరక్షల దుకాణం తెరవాలని ఇలా పలు రకాల సాకులు చెప్పి హాసన్ నుంచి మహమ్మద్ హఫీజ్ రూ.92 కోట్లకు పైగా రాబట్టాడు.
Guide Married Belgium girl: బెల్జియం పిల్లతో హంపి పిలగాని లగ్గం..
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
అల్లుడి మోసం గురించి ఆలస్యంగా తెలుసుకున్న ఎన్నారై వ్యాపారవేత్త అబ్దుల్ లాహిర్ హాసన్ కేరళలోని అలువా పోలీసులను ఆశ్రయించారు. తన కూతురికి బహుమానంగా ఇచ్చిన ఎనిమిది కేజీల బంగారంతో పాటు రూ.107 కోట్ల ఆస్తిని హఫీజ్ కాజేశాడని హాసన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రూ. 100 కోట్లకు పైగా డబ్బుతో అతని అల్లుడు పరారయ్యాడని పోలీసులు వెల్లడించారు. అతను గోవాలో ఉన్నట్లు సమాచారం. దీంతో కేసు దర్యాప్తును నవంబర్ 24న కేరళ పోలీసులు క్రైమ్ బ్రాంచ్ విభాగానికి ఈ కేసును అప్పగించారు. అలువా పోలీసులు నిందితుడిని అరెస్టు చేయడంలో విఫలమయ్యారని లేదా అతనిని విచారణకు పిలవలేదని, నిందితుడు వాడుకోవడానికిఇచ్చిన రూ. 1.5 కోట్ల విలువైన కారును కూడా వారు అతని నుంచి రికవరీ చేయలేకపోయారని ఫిర్యాదుదారు హసన్ ఒక టీవీ ఛానెల్‌తో చెప్పారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రైడ్ తర్వాత విధించిన జరిమానాను చెల్లించడానికి తన అల్లుడు సుమారు రూ. 4 కోట్లు అడగడంతో మోసం ప్రారంభమైందని హసన్ చెప్పారు. హసన్ అల్లుడు ఒంటరిగా చేయలేదని, అతనికి సహచరుడు కూడా ఉన్నాడని ఓ పోలీసు అధికారి తెలిపారు. హసన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వారిద్దరి పేర్లను పేర్కొన్నట్లు అధికారి తెలిపారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!