NTV Telugu Site icon

PM Modi: ప్రధాని మోడీ ఇంటిపై డ్రోన్ కదలికలు.. దర్యాప్తు ప్రారంభించిన ఢిల్లీ పోలీసులు

Pm Modi

Pm Modi

PM Modi: న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాసంపై సోమవారం ఉదయం డ్రోన్ తిరుగుతున్నట్లు సమాచారం అందడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే విచారణను ప్రారంభించారు. ప్రధాని మోదీ నివాసం డ్రోన్ లేని జోన్‌ కిందకు వస్తుంది. అయినప్పటికీ ప్రధాని మోడీ ఇంటిపై డ్రోన్‌ ఎగరడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

Read also: Sania Mirza : రిటైర్మెంట్ ప్రకటించిన కూడా మళ్ళీ టెన్నిస్ ఆడనున్న సానియా..

సోమవారం ఉదయం న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంపై డ్రోన్ సంచరించినట్లు తెలియడంతో ఢిల్లీ పోలీసులు వెతుకుతున్నారు. తెల్లవారుజామున 5 గంటలకు, ప్రధానమంత్రికి రక్షణగా ఉండే ఉన్నత దళం అయిన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అధికారులు డ్రోన్ వీక్షణ గురించి పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు డ్రోన్‌ను గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇప్పటి వరకు డ్రోన్‌ను గుర్తించలేదు. ప్రధాని మోడీ నివాసం రెడ్ నో ఫ్లై జోన్ కిందకు వస్తుంది. సెంట్రల్ ఢిల్లీలోని VVIP జోన్‌లో.. 7 లోక్ కళ్యాణ్ మార్గ్ వద్ద ఉన్న ప్రధానమంత్రి నివాసం దాని పరిసరాల్లో డ్రోన్‌ల ఆపరేషన్‌ను ఖచ్చితంగా నిషేధించింది. డ్రోన్ ఉనికిని నిబంధనలను ఉల్లంఘించేలా చేస్తూ, మొత్తం ప్రాంతాన్ని నో-ఫ్లై జోన్‌గా నిర్ణయించారు. ఇప్పటి వరకు కూడా సందేహాస్పద డ్రోన్‌ను కనుగొనబడలేదని విశ్వసనీయంగా తెలిసింది.